ETV Bharat / sports

'ఐపీఎల్​పై నేను అలా అన్లేదు.. కావాలనే వక్రీకరించారు' - icc tourney

Ramiz Raja IPL: పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ను దాటి ఐపీఎల్​ ఎవరు ఆడతారో చూస్తామంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రమీజ్​ రాజా. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా.. ఇప్పుడు మాట మార్చాడు. అలా అనలేదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.

Ramiz Raja clarifies On ipl comments
Ramiz Raja clarifies On ipl comments
author img

By

Published : Apr 5, 2022, 8:30 AM IST

Updated : Apr 5, 2022, 8:37 AM IST

Ramiz Raja IPL: ప్రతిష్టాత్మక ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​పై (ఐపీఎల్​) పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రమీజ్​ రాజా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో(పీఎస్​ఎల్​) వచ్చే సీజన్​ నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, అప్పుడు ఐపీఎల్​కు ఎవరు వెళ్తారో చూస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విమర్శలు రావడంతో.. తాజాగా రమీజ్​ రాజా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అలా అనలేదని అన్నాడు.

''భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, పాక్​ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. పీఎస్​ఎల్​ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మా వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామనుకున్నాం. అంతేకానీ.. నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.''

- రమీజ్​ రాజా, పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​

ఈ నేపథ్యంలోనే వచ్చే వారం దుబాయ్​లో జరగనున్న ఐసీసీ బోర్డు మీటింగ్​పై స్పందించాడు. నాలుగు దేశాల (ఇండియా, పాకిస్థాన్​, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​) టోర్నీపై ప్రతిపాదించనున్నట్లు వెల్లడించాడు. గతేడాది వరల్డ్​కప్​లో భారత్​- పాకిస్థాన్​ మ్యాచ్​ను రికార్డు స్థాయిలో జనం చూశారని స్టార్​ స్పోర్ట్స్​ చెప్పిందని, అలాంటప్పుడు ఫ్యాన్స్​ కోరుకున్నట్లుగా రెండు దేశాల మధ్య క్రికెట్​ ఎందుకు నిర్వహించట్లేదని ఐసీసీకి సూటి ప్రశ్న వేశాడు.

ఇవీ చూడండి: 'పాక్​లో నాలుగు దేశాలతో వన్డే టోర్నీ.. గంగూలీతో చర్చిస్తా'

ఐపీఎల్​కు పాకిస్థాన్​ సవాల్​.. ఎలా ఆడతారో చూస్తామంటూ..!

Last Updated : Apr 5, 2022, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.