ETV Bharat / sports

'వీళ్లు క్రికెటర్లా.. లేక రెజ్లర్లా?' - ఆకిబ్ జావెద్

పాకిస్థాన్​ జట్టు​ ఎంపికపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ఆ దేశ మాజీ ఆటగాడు ఆకిబ్​ జావెద్(Aaqib Javed)​. ఫిట్​నెస్​తో సంబంధం లేకుండా ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని పేర్కొన్నాడు.

aaquib javeb, former pakistan cricketer
ఆకిబ్ జావెద్, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్
author img

By

Published : Jul 16, 2021, 6:48 PM IST

Updated : Jul 16, 2021, 7:31 PM IST

పాకిస్థాన్​ సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ ఆకిబ్​ జావెద్(Aaqib Javed)​. పాక్​ టీమ్​లో ఆటగాళ్ల కంటే ఎక్కువగా రెజ్లర్లనే చూస్తున్నాని ఎద్దేవా చేశాడు. ఫిట్​నెస్​కు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వకుండా.. బయటకు బలంగా కనపడుతున్న ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారని ఆరోపించాడు.

ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో పాకిస్థాన్​ ఓటమి పాలైంది. దీనిపై స్పందించాడు ఆకిబ్​. ఇంగ్లాండ్​తో సిరీస్​ విషయంలో పాక్ సెలెక్టర్లకు, ఆటగాళ్లకు సరైన ప్రణాళికలు లేవన్నాడు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​.. యువ ఆటగాళ్లతోనూ సిరీస్​ గెలిచిందని చెప్పాడు.

"ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం జట్టు ఎంపికలో పాక్ సెలెక్టర్లకు సరైన ప్రణాళికలు లేవు. వారేం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ప్రస్తుత జట్టులో ఆటగాళ్ల కంటే రెజ్లర్లనే ఎక్కువ చూస్తున్నా. షార్జిల్​ ఖాన్​, అజామ్​ ఖాన్, సోహైబ్​ మక్సూద్​ వంటి ఆటగాళ్ల ఫిట్​నెస్​.. అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడటానికి పనికొస్తుందా?"

-ఆకిబ్​ జావెద్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం ఇంగ్లాండ్​లో పర్యటిస్తోంది పాకిస్థాన్. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్​ను ఇంగ్లాండ్​ క్లీన్​స్వీప్​ చేయగా.. ఇక మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి: దాదాను స్లెడ్జ్ చేయడానికి.. బాత్రూమ్ నుంచి పరిగెత్తి!

Last Updated : Jul 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.