ETV Bharat / sports

కెరీర్‌ మొత్తం వర్ణ వివక్షకు గురయ్యా: భారత మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో జాతి వివక్షపై(Colour discrimination in Cricket) దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌ ఆసాంతం వర్ణ వివక్షతకు గురైనట్లు ట్వీట్​ చేశాడు.

Former spinner Sivaramakrishnan
మాజీ స్పిన్నర్​ శివరామకృష్ణన్‌
author img

By

Published : Nov 29, 2021, 7:40 AM IST

తన కెరీర్‌ ఆసాంతం వర్ణ వివక్షతకు గురయ్యానని భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో జాతి వివక్షపై(Colour discrimination in Cricket) దుమారం రేపుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.

  • I have been criticised and colour discriminated all my life, so it doesn’t bother me anymore. This unfortunately happens in our own country

    — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) November 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా కెరీర్‌ మొత్తంలో చాలాసార్లు వర్ణ వివక్షకు గురయ్యా. రంగు గురించిన విమర్శలను ఎదుర్కొన్నా. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏమిటంటే స్వదేశంలోనూ వివక్షకు గురి కావడం" అని శివరామకృష్ణన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

శివరామకృష్ణన్‌(spinner Laxman Sivaramakrishnan) మాత్రమే కాదు తమిళనాడు ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ కూడా 2017లో సామాజిక మధ్యమాల్లో వర్ణ వివక్ష గురించి వ్యాఖ్యలు చేశాడు. "15 ఏళ్ల వయసు నుంచి విదేశాలకు వెళుతున్నా. నా రంగు గురించి కొంతమంది మాట్లాడుకోవడం, వ్యాఖ్యలు చేయడం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. క్రికెట్‌ను(India cricket news) అనుసరించేవాళ్లకు ఆటగాళ్లు రంగు మారడం గురించి అవగాహన ఉంటుంది. మేం ఎర్రటి ఎండలో సాధన చేస్తాం. సూర్యుడి వెలుగులో గంటల కొద్దీ మైదానంలో ఉంటాం. ఇలాంటప్పుడు రంగుల్లో తేడాలు రావడం కూడా సహజమే" అని అప్పట్లో ముకుంద్‌ ట్వీట్‌ చేశాడు.

తానూ జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు కర్ణాటక మాజీ పేసర్‌ దొడ్డా గణేశ్‌ కూడా గతేడాది పేర్కొన్నాడు. తాజాగా యార్క్‌షైర్‌ ఆటగాడు అజీమ్‌ రఫీఖ్‌పై ఆ జట్టు సభ్యులు వివక్ష చూపించినట్లు తేలడంతో వివాదం రేగింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా యార్క్‌షైర్‌ క్లబ్‌పై నిషేధం కూడా పడింది.

ఇదీ చూడండి: ఈ విదేశీ స్టార్ క్రికెటర్ల కేరాఫ్ అడ్రస్ @భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.