ETV Bharat / sports

Ind vs Eng: 'కోహ్లీ నుంచి మార్పులు ఆశించొద్దు' - kohli latest news

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు కోసం టీమ్​ఇండియా మార్పులేం జరగకపోవచ్చని పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. పాత జట్టునే కెప్టెన్ కోహ్లీ కొనసాగించే అవకాశముందని పేర్కొన్నాడు.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Aug 31, 2021, 6:49 AM IST

త్వరలో ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం టీమ్​ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్‌ అన్నాడు.

.
.

'జట్టులోకి కొత్తగా ఎవరిని తీసుకున్నా.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఇదే జట్టుతో మిగతా మ్యాచులు ఆడవచ్చు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదనపు బ్యట్స్‌మెన్‌తో బరిలోకి దిగే ఉద్దేశమేమీ లేదని కోహ్లీనే స్పష్టం చేశాడు. కాబట్టి, పెద్దగా మార్పులు ఉండవు. మూడో టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ స్పందించిన తీరుని చూస్తే.. ఓవల్​లో జరగబోయే నాలుగో టెస్టుకు పెద్దగా మార్పులేమి చేయకపోవచ్చనిపించింది. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి అతడు మాట్లాడలేదు. జట్టు సమష్టి కృషి గురించే మాట్లాడాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాతే మార్పుచేర్పులు చేయవచ్చు" అని సల్మాన్ చెప్పాడు.

Virat Kohli
కోహ్లీ-అండర్సన్

ఇటీవల జరిగిన మూడో టెస్టులో భారత్‌, ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 5 మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 1-1తో సమం చేసింది. నాలుగో మ్యాచ్ సెప్టెంబరు 2 నుంచి మొదలుకానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.