న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్(IND vs NZ test series 2021)లో భాగంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. అయితే, ఇద్దరూ స్పిన్నర్లే కావడం వల్ల.. వారు ఒకే మ్యాచ్‌లో ఆడలేరని పేర్కొన్నాడు.
"అక్షర్ పటేల్ నాణ్యమైన స్పిన్నర్. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, రవీంద్ర జడేజా జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించగలడు. చాలా మంది సీనియర్లు ఈ టెస్టు సిరీస్‌కు దూరం కావడం వల్ల ప్రస్తుతం జడేజా అవసరం జట్టుకు చాలా ఉంది. జట్టు యాజమాన్యం కూడా జడేజా వైపే మొగ్గు చూపవచ్చు. అనుకోని పరిస్థితుల్లో జడేజా మ్యాచ్‌కు దూరమైతే తప్ప.. అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు దొరకడం కష్టం. అందుకే వారిద్దరూ ఒకే మ్యాచ్‌లో ఆడటం దాదాపు కష్టమే అనిపిస్తోంది."
-సల్మాన్ భట్, పాక్ మాజీ క్రికెటర్
WTC Final Match India vs New Zealand:ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్, భారత్ జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాపై ఘన విజయం సాధించి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇరు జట్లు టెస్టుల్లో తలపడటం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో అజింక్య రహానె సారథ్యంలోని భారత్ జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.