ETV Bharat / sports

ఆ విషయం కొన్నాళ్లకు తెలుసుకున్నా: భువనేశ్వర్ కుమార్

author img

By

Published : May 28, 2021, 1:29 PM IST

తన బౌలింగ్​కు పేస్ జోడించాలనే విషయాన్ని, అంతర్జాతీయ కెరీర్​ మొదలుపెట్టిన కొన్నాళ్లకు తెలుసుకున్నానని భువనేశ్వర్ కుమార్ అన్నాడు. క్రమక్రమంగా పేస్ మెరుగుపరుచుకున్నానని తెలిపాడు.

Bhuvneshwar bowling
భువనేశ్వర్ కుమార్

స్టార్ పేసర్ భువనేశ్వర్​ కుమార్(Bhuvneshwar Kumar).. తన బౌలింగ్, స్వింగ్, వేగం గురించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. కెరీర్​ ప్రారంభంలో చాలా నెమ్మదిగా బౌలింగ్​ చేసేవాడినని అన్నాడు. దానికి పేస్ జోడించడం ఎంత ముఖ్యమో తర్వాతి కాలంలో తెలుసుకున్నానని చెప్పాడు.

"నిజం చెప్పాలంటే, కెరీర్​ ప్రారంభంలో నా బౌలింగ్​లో పేస్ ప్రాముఖ్యాన్ని తెలుసుకోలేకపోయాను. స్వింగ్​తో 120-130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్​ చేస్తున్నంటే బ్యాట్స్​మన్ కుదురుకుంటున్నారు. దాంతో నా బౌలింగ్​లో పేస్ పెంచాలని నిర్ణయించుకున్నాను. ఎలా చేయాలో తెలియనప్పటికీ క్రమక్రమంగా ఆ విషయంలో మెరుగుపడ్డాను" అని భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు.

ఐపీఎల్​(IPL)లో సన్​రైజర్స్ హైదరాబాద్​కు(sunrisers hyderabad) ఆడుతున్న భువీకి.. ఇటీవల కాలంలో వరుసగా గాయాలయ్యాయి. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​(world test championship) సహా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.