ETV Bharat / sports

ప్లీజ్ అలా అనొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంది: కోహ్లీ - kohli react on compare with sachin

టీమ్​ ఇండియా స్టార్ ప్లేయర్​ విరాట్‌ కోహ్లీ అలా అనొద్దని సూచించాడు. చాలా ఇబ్బందిగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

kohli sachin
ప్లీజ్ అలా అనొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంది: కోహ్లీ
author img

By

Published : Apr 18, 2023, 7:53 PM IST

Updated : Apr 18, 2023, 8:42 PM IST

టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్‌, స్టార్ ప్లేయర్​ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆటతీరు, ఫిట్​నెస్​తో​​ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్​లో అతడెప్పుడు ముందువరసలోనే ఉంటాడు. అలా తన అద్భుతమైన గేమ్​తో ఎన్నో వరల్డ్​ రికార్డ్స్​ను బద్ధలు కొట్టి 'రన్‌ మెషీన్‌'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకే అతడిని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌తో పోలుస్తుంటారు చాలా మంది అభిమానులు. అయితే తాజాగా ఈ విషయంపై కోహ్లీ మాట్లాడాడు. ఫ్యాన్స్​ తనను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​తో పోల్చడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. తాను సచిన్‌ అంత గొప్పవాడిని కాదని అన్నాడు.

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్పతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కోహ్లీ. అక్కడ మాట్లాడుతూ.. "సచిన్‌ తెందుల్కర్‌తో నన్ను పోల్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఆయన అంత గ్రేట్​ మ్యాన్​, గొప్ప వాడిని కాదు. ఆయన్ను ప్రతి ఒక్కరూ సొంతవాడిలా భావిస్తారు. ప్రతిఒక్కరికీ ఆయన అంటే ఓ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం. మా ఇద్దరినీ కంపేర్​ చేస్తూ గణాంకాలను ఎక్కడ నుంచి సేకరిస్తారో తెలీదు కానీ, వాటిని చూస్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్​ విరుద్ధంగా ఉంటాయి. సచిన్‌, వివ్‌ రిచర్డ్స్‌ వంటి దిగ్గజాలతో ఎవరినీ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే వారు ఆడేటప్పుడు క్రికెట్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. వారు లెజెండ్స్​" అని పేర్కొన్నాడు.

కాగా, కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక మ్యాచులు, పరుగులు, సెంచరీలు, అర్ధ శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ముందువరుసలో కొనసాగుతున్నాడు. అలాగే అత్యధిక సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు గెలిచిన ప్లేయర్‌గానూ తన కెరీర్​లో తిరుగులేని రికార్డులెను సొంతం చేసుకున్నాడు. ఆ మధ్యలో నాలుగేళ్ల పాటు ఫామ్​ కోల్పోయిన మళ్లీ గర్జించి ఫామ్​లోకి వచ్చాడు. ప్రస్తుతం తన మునపటి ఫామ్​ను కొనసాగిస్తున్న అతడు.. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023 సీజన్​లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్స్ లిస్ట్​లో విరాట్‌ కోహ్లీ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విరాట్​ 220 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తాజా సీజన్​లో అతడి బెస్ట్​ స్కోర్‌ 82. అలానే ఈ నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్​ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అతడి సగటు 55, స్ట్రైక్‌ రేట్‌ 147.65గా ఉంది.

ఇదీ చూడండి: IPL 2023 : ఏంటి.. ఈ ప్లేయర్స్​కు ఇదే చివరి ఐపీఎల్‌ సీజనా?

Last Updated : Apr 18, 2023, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.