ఎంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లనైనా ఏదో ఒక దశలో గాయాలు వేధించడం మామూలే. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అందుకు మినహాయంపు కాదు. అతణ్ని 2014లో వెన్నునొప్పి(Virat Kohli Back Pain) బాగానే వేధించిందట. ప్రతి రోజూ దాని వల్ల ఇబ్బంది పడ్డాడట. అయితే అప్పటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు సాయంతో(Shankar Basu Virat Kohli) ఆ సమస్యను అధిగమించాడట. ఈ విషయాన్ని బసు రాసిన ఓ పుస్తకంలో కోహ్లీ వెల్లడించాడు.
"2014లో వెన్నునొప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రతి రోజూ ఉదయం లేవగానే నడుం పట్టేసినట్లుండేది. 45 నిమిషాల కసరత్తుల తర్వాత కానీ అది మామూలయ్యేది కాదు. మళ్లీ రోజు మధ్యలో ఏదో ఒక దశలో మళ్లీ సమస్య తలెత్తేది. అప్పుడు బసు సర్‌తో మాట్లాడా. ఆయన కొన్ని వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులు చెప్పాడు. కానీ అవి చేయడానికి నాకు మనస్కరించలేదు. కానీ 'నన్ను నమ్ము' అని చెప్పి బసు ఆ కసరత్తులు చేయించాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. స్టెంత్, కండిషనింగ్ ప్రాధాన్యమేంటో అప్పుడే నాకు తెలిసింది" అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. 'న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లపై ప్రతీకారం తీర్చుకోండి'