ETV Bharat / sports

ఆసీస్ స్పిన్ మంత్ర.. టీమ్ఇండియాను చుట్టేయాలని ప్లాన్.. ఇరు జట్లకూ ముప్పే? - ఆస్ట్రేలియా టీమ్​లో స్పిన్నర్స్​

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మొదలవ్వడానికి కొన్ని వారాల ముందే ఈ సిరీస్‌లో పిచ్‌లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైపోయింది. ఆస్ట్రేలియా కోసం విపరీతంగా స్పిన్‌ తిరిగే పిచ్‌లను భారత్‌ సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తొలి రోజు నుంచే బంతి బాగా తిరిగే పిచ్‌ను సిద్ధం చేసి.. కంగారూలను స్పిన్‌ ఉచ్చులో బిగించేయాలని భారత్‌ చూస్తునట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం భారత్‌కు మేలు చేసేదేనా? ఒకవేళ స్పిన్‌ ఉచ్చులో ప్రత్యర్థిని బిగించబోయే మన జట్టే చిక్కుకునే పరిస్థితి వస్తే ఎలా?

India Vs Australia teams
India Vs Australia teams
author img

By

Published : Feb 7, 2023, 7:04 AM IST

చరిత్ర చూస్తే ఉపఖండేతర జట్లన్నింటికీ స్పిన్‌ ఆడడంలో సమస్య ఉన్న మాట వాస్తవం. ఆస్ట్రేలియా కూడా అందుకు మినహాయింపు కాదు. చాలా ఏళ్ల నుంచి ఆ జట్టు బ్యాటర్లు భారత పర్యటనలో స్పిన్నర్లను ఆడలేక తడబడుతున్నారు. స్పిన్‌ ఆయుధంతోనే కంగారూలను దెబ్బ తీసి సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది భారత్‌. ఈసారి కూడా అదే మంత్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి ప్రత్యర్థి ప్రణాళికాబద్ధంగానే సిరీస్‌కు సిద్ధమతున్నట్లు కనిపిస్తోంది. అసలు మ్యాచ్‌లకు భిన్నంగా పచ్చిక పిచ్‌ ఇచ్చి తమ సన్నద్ధతను దెబ్బ తీస్తారనే ఉద్దేశంతో అసలు వార్మప్‌ మ్యాచే వద్దనుకుంది. దాని బదులు నెట్‌ సెషన్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆ జట్టు బ్యాటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. తమ జట్టులోని స్పిన్నర్లకు తోడు నెట్‌ బౌలర్లుగా భారత దేశవాళీ స్పిన్నర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు.

సిరీస్‌లో తమకు ప్రధాన ముప్పు అవుతాడని భావిస్తున్న అశ్విన్‌ లాగే బంతులేసే మహీష పితియా అనే యువ స్పిన్నర్‌ బౌలింగ్‌లో సాధన సాగిస్తున్న విషయం కూడా వెల్లడైంది. ఇక ఆ జట్టు గతంతో పోలిస్తే స్పిన్‌ ఆడడంలో మెరుగైన మాట కూడా వాస్తవం. స్టీవ్‌ స్మిత్‌ ముందు నుంచి స్పిన్నర్లను ఆడడంలో దిట్ట. భారత్‌లో అతడికి మంచి రికార్డుంది కూడా. మంచి ఫామ్‌లో ఉన్న ఉస్మాన్‌ ఖవాజా, లబుషేన్‌ కూడా స్పిన్‌ను బాగానే ఆడతారు. ఈసారి తమ ప్రదర్శనతో పాటు ఫలితాన్ని కూడా మార్చాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా ఆస్ట్రేలియన్ల మాటలు, సన్నాహాల్ని బట్టి స్పష్టమవుతోంది.

మనోళ్లు సిద్ధమా?:
ఆస్ట్రేలియన్లు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నది పక్కన పెడితే.. బంతి విపరీతంగా తిరిగితే మన బ్యాటర్లు ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలరా అన్నది ప్రశ్న. ఇప్పుడు భారత ప్రధాన బ్యాటర్లు ఎవరూ ఉత్తమ ఫామ్‌లో లేరు. కోహ్లి, రోహిత్‌, పుజారా, రాహుల్‌ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. మిగతా బ్యాటర్లకు అంత అనుభవం లేదు. బంతి బాగా తిరిగే పిచ్‌పై నాణ్యమైన స్పిన్నర్లు ఎదురైతే మన బ్యాటర్లు కూడా తడబడుతున్న సందర్భాలు చూస్తున్నాం.

ముఖ్యంగా బంగ్లాదేశ్‌ పర్యటనలో మెహిదీ మిరాజ్‌, షకిబ్‌, తైజుల్‌ ఇస్లామ్‌ భారత బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు. శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌ పోరాడకుంటే తొలి టెస్టులో భారత్‌కు పరాభవం తప్పేది కాదు. ఆ సిరీస్‌ అంతా స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రధాన బ్యాటర్ల తడబాటు కొనసాగింది. ఇప్పుడు సొంతగడ్డపై పిచ్‌ స్పిన్‌కు పూర్తి అనుకూలంగా మారితే.. సమర్థంగా ఎదుర్కోగలరా అన్నది ప్రశ్న. ఆస్ట్రేలియా జట్టులో లైయన్‌, అస్టన్‌ అగార్‌, స్వెప్సన్‌, టాడ్‌ మర్ఫీల రూపంలో ప్రతిభావంతులైన స్పిన్నర్లున్నారు. ముఖ్యంగా లైయన్‌ ప్రపంచంలో ఎక్కడైనా వికెట్లు పడగొట్టగలడు.

పేస్‌ పిచ్‌ల మీద కూడా అతను సత్తా చాటాడు. సొంతగడ్డపై 2021లో ఇంగ్లాండ్‌తో పేసర్ల ఆధిపత్యం సాగిన సిరీస్‌లో అతను 16 వికెట్లు పడగొట్టాడు. ఇక గత ఏడాది పాకిస్థాన్‌పై కంగారూ సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్‌ గెలవడంలోనూ అతడిది కీలక పాత్ర. మూడు టెస్టుల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ అతను వికెట్ల పండుగ చేసుకున్నాడు. మొత్తంగా 20 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్‌లో బంతి బాగా తిరిగే పిచ్‌ ఇస్తే అతను ప్రమాదకారిగా మారతాడనడంలో సందేహం లేదు. అగార్‌కు సైతం బాగానే అనుభవం ఉంది.

భారత్‌కు రావడం ఇదే తొలిసారి అయినా.. బంగ్లాదేశ్‌లో సత్తా చాటిన అనుభవం ఉంది. స్పిన్‌ వికెట్లు సిద్ధం చేసుకుని వారం కిందట్నుంచే ఆసీస్‌ స్పిన్‌ త్రయం సాధన సాగిస్తున్న నేపథ్యంలో వారు సిరీస్‌లో సవాలు విసరడం ఖాయం. కాబట్టి స్పిన్‌ వికెట్లు సిద్ధమైతున్నాయని మరీ సంబరపడాల్సిన పని లేదు. బంతి మరీ ఎక్కువ తిరిగితే మనకూ ముప్పు పొంచి ఉంటుందన్నది స్పష్టం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.