ETV Bharat / sports

'శాస్త్రి, ధోనీ మధ్య భేదాభిప్రాయాలు వస్తే!'

టీమ్​ఇండియా కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి ఎంఎస్ ధోనీ మధ్య భేదాభిప్రాయాలు(Coach vs Mentor) రాకూడదని ఆశిస్తున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News) తెలిపాడు. టీ20 ప్రపంచకప్​ కోసం భారత జట్టును ఎంపిక చేసి, ధోనీని మెంటార్​గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

dhoni, ravi shastri
ధోనీ, రవిశాస్త్రి
author img

By

Published : Sep 9, 2021, 1:41 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ కోసం జట్టును ప్రకటించింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI). ఈ జట్టుకు మెంటార్​గా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని(Dhoni Mentor) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News). ఈ నేపథ్యంలో.. భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి ధోనీకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తవని అభిప్రాయపడ్డాడు.

"2004లో టీమ్​ఇండియా జట్టుకు మెంటార్​గా నేను ఎంపికైనప్పుడు జాన్​ రైట్(నాటి భారత జట్టు కోచ్) కాస్త దిగులుగా కనిపించారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో నేను ఉన్నానని అనుకున్నారు. కాబట్టి మెంటార్​కు, కోచ్​కు ఏకాభిప్రాయాలు ఉండటం చాలా ముఖ్యం."

-సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.

రవిశాస్త్రి, ధోనీ ఏకాభిప్రాయంతో(Coach vs Mentor in Cricket) పనిచేస్తే టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా మంచి ఫలితాలు సాధిస్తుందని గావస్కర్ పేర్కొన్నాడు.

"కోచ్​ అవ్వాలనే ఆసక్తి ధోనీకి లేదని రవిశాస్త్రికి తెలుసు. శాస్త్రి, ధోనీ కలిసికట్టుగా ఉంటే జట్టుకు లాభం జరుగుతుంది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వస్తే జట్టుపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ధోనీ మెంటార్​గా ఉండటం వల్ల జట్టుకు ఎంతో బలం చేకూరుతుందనే చెప్పొచ్చు."

-సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.

రవిశాస్త్రి, ధోనీ ఒకే నిర్ణయంపై పనిచేస్తారని ఆశిస్తున్నట్లు గావస్కర్ తెలిపాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్​ జట్టు.. మెంటార్​గా ధోనీ

ధావన్ ఔట్.. ఇషాన్ ఇన్.. సెలక్టర్ల మాటేంటంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.