ETV Bharat / sports

భారత క్రికెట్​లో విషాదం.. 28ఏళ్ల యంగ్ క్రికెటర్​ మృతి.. షాక్​లో ఫ్యాన్స్​​

హిమచల్​ ప్రదేశ్​కు చెందిన యంగ్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్​ సిద్ధార్థ్ శర్మ అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచాడు. చిన్న వయసులోనే కన్నుమూయడంతో సహ ఆటగాళ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Himachal Pradesh cricketer Siddharth Sharma dies aged 28
భారత క్రికెట్​లో విషాదం.. 28ఏళ్ల యంగ్ క్రికెటర్​ మృతి.. షాక్​లో ఫ్యాన్స్​​
author img

By

Published : Jan 13, 2023, 6:58 PM IST

భారత క్రికెట్​లో విషాదం జరిగింది. రంజీల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడుతున్న సిద్ధార్థ్ శర్మ కన్నుమూశాడు. కేవలం 28 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు విడవడంతో క్రికెట్​ అభిమానులు షాకవుతున్నారు. ఈ విషయన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు క్రికెటర్లు కూడా అతడికి నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

2022 విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమైన సిద్ధార్థ్ కొన్నాళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నాడు. అనంతరం మ్యాచుల్లో పాల్గొంటూ కెరీర్​ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రంజీలో భాగంగా జట్టుతో కలిసి గుజరాత్ వెళ్లిన సిద్ధార్థ్ శర్మ అక్కడ మళ్లీ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో గత రెండు వారాల నుంచి వెంటిలేటర్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రాణాలతో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు.

సిద్ధార్థ్ కెరీర్ విషయానికొస్తే 2017-18లో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు. రంజీల్లో 25 వికెట్లు తీశాడు. 2021-22లో విజయ్ హజారే ట్రోఫీలో ఆరు మ్యాచులు ఆడి.. 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇదీ చూడండి: మూడో వన్డేకు ముందు టీమ్​ఇండియాకు షాక్​.. రాహుల్​ ద్రవిడ్​కు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.