ETV Bharat / sports

'అతడు కాబోయే వరల్డ్‌ నెం.1 బౌలర్‌.. ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాల్సిందే!' - అర్ష్​దీప్​ సింగ్​ టీ20 ప్రపంచ కప్​

విండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న బౌలర్​ అర్ష్​దీప్​ సింగ్​ ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని టీమ్​ఇండియా మాజీ సెలెక్టర్​ కృష్ణమాచారి శ్రీకాంత్​ తెలిపాడు. ప్రపంచకప్‌ జట్టులో తప్పకుండా అతడికి చోటు కల్పించాలని ప్రస్తుత చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మకు క్రిష్ సూచించాడు.

arsh deep singh
arsh deep singh
author img

By

Published : Aug 4, 2022, 11:27 AM IST

T20 World Cup: గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అనూహ్యంగా గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైంది. ఈసారి మాత్రం ఎలాగైనా కప్‌ సాధించడమే లక్ష్యంగా రాహుల్‌ ద్రవిడ్, రోహిత్ శర్మ ద్వయం టీమ్‌ను సమాయత్తం చేసే కార్యాచరణతో బిజీగా ఉంది. ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 మంది ఫాస్ట్‌ బౌలర్లతోపాటు నలుగురైదుగురు ఆల్‌రౌండర్లను సిద్ధంగా ఉంచింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ (క్రిష్‌) టీమ్‌ ఎంపికపై పలు సూచనలు చేశాడు.

Arshdeep Singh: 2022 భారత టీ20 లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఇద్దరు యువ పేసర్లను ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకొనేందుకు పరిగణనలోకి తీసుకొంటే.. వారిలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఉంటారన్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న ఈ కుర్రాడి ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని క్రిష్ వెల్లడించాడు. ప్రపంచకప్‌ జట్టులో తప్పకుండా అతడికి చోటు కల్పించాలని ప్రస్తుత చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మకు క్రిష్ సూచించాడు.

arsh deep singh
అర్ష్​ దీప్​ సింగ్​

"అర్ష్‌దీప్‌ చాలా చక్కగా బంతులను సంధిస్తున్నాడు. డెత్‌ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్‌ చేయడం అద్భుతం. అతడు తప్పకుండా భవిష్యత్తులో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎదుగుతాడు. అందుకే, అర్ష్‌దీప్‌ను ప్రపంచ కప్‌ జట్టులోకి తీసుకోవాలి. ప్లీజ్‌ చేతూ (చేతన్‌ శర్మ) అతడి పేరును లిస్ట్‌లో చేర్చాలి"

-- కృష్ణమాచారి శ్రీకాంత్​ , టీమ్​ఇండియా మాజీ చీఫ్​ సెలెక్టర్

ఇప్పటికే ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌ స్థానాలను సుస్థిరం చేసుకోగా.. హర్షల్‌ పటేల్, అవేశ్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్, మహమ్మద్‌ షమీ తదితరులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ కూడా తన ప్రదర్శనతో బరిలోకి దిగాడు. మరోవైపు భారత్‌లోనే ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా ఎదుగుతున్న ఉమ్రాన్‌ మాలిక్‌కూ అవకాశాలు ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్న క్రమంలో టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: womens cricket: సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. బార్బడోస్​పై భారీ విజయం

వెయిట్​లిఫ్టింగ్​లో​ కాంస్యం.. హాకీ, బాక్సింగ్​లో భారత్​ జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.