ETV Bharat / sports

హర్మన్​ప్రీత్​కు షాక్​.. ఆ చర్య వల్ల భారీ మొత్తంలో ఫైన్.. - ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళలు 2023

టీమ్ఇండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్​ కౌర్​​కు షాక్ తగిలింది. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో ఆమె క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని.. ఫీజులో కోత విధించారు మ్యాచ్ నిర్వాహకులు. ఈ వివరాలు..

harmanpreet kaur fined
హర్మన్​కు ఫైన్ విధించిన మ్యాచ్ రిఫరీ
author img

By

Published : Jul 23, 2023, 4:15 PM IST

Updated : Jul 23, 2023, 4:20 PM IST

Harmanpreet Kaur Fine : టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్​కు షాక్​ తగిలింది. తాజాగదా ఆమె చేసిన ఓ పనికి మ్యాచ్ నిర్వాహకులు ఫీజులో 75 శాతం కోత విధించారు. ఈ క్రమంలో ఫైన్​తో పాటు ఆమెకు మూడు డిమెరిట్ పాయింట్లు వచ్చాయి. బంగ్లాదేశ్​తో జరిగిన మూడో వన్డేలో తన ఔట్​ పట్ల అంపైర్లపై అసహనం వ్యక్తం చేస్తూ.. స్టంప్స్​ను బలంగా కొట్టినందుకు 50 శాతంతో పాటు రెండు పాయింట్లు ఫైన్​గా నిర్వాహకులు విధించారు. కాగా మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో.. బంగ్లా కెప్టెన్​తో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను అదనంగా 25 శాతంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?
భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో మ్యాచ్​లో హర్మన్​ 33.4 వద్ద ఎల్​బిడబ్ల్యూగా పెలిలియన్ చేరింది. అయితే బంగ్లా బౌలర్ నహిద అక్తర్ వేసిన టాస్​ బంతిని హర్మన్ స్వీప్ చేయబోయింది. ఈ క్రమంలో బంతి బ్యాట్ అంచున ముద్దాడి.. ఆమె లెగ్ ప్యాడ్స్​కు తగిలింది. దీంతో బంగ్లా బౌలర్లు అప్పీల్ చేయకముందే.. ఫీల్డ్ అంపైర్​ హర్మన్​ను ఔట్​గా ప్రకటించారు.

అంతే తాను ఔట్ కాదంటూ.. హర్మన్ పట్టరాని కోపంతో స్టంప్స్​ను బలంగా కొట్టి, అంపైర్​ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా మ్యాచ్​ ప్రజెంటేషన్​ సమయంలో అంపైర్లను ఉద్దేశించి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది హర్మన్. ఇరుజట్ల కెప్టెన్​లు ట్రోఫీ అందుకునే సమయంలో హర్మన్​.. బంగ్లా ప్లేయర్లతో 'మీతో పాటు అంపైర్లను తెచ్చుకోండి' అంటూ బాంబ్ పేల్చింది. అంతే.. అంపైర్లను కూడా బంగ్లాదేశ్ జట్టులోని సభ్యులుగా భావించడం మరో తప్పిదంగా భావిస్తూ మ్యాచ్ రిఫరీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

కెప్టెన్​కు మద్దతుగా స్మృతి...
ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ హర్మన్​కు, వైస్ కెప్టెన్ స్మృతి మద్దతుగా నిలిచారు. తన ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని అభిప్రాయపడింది. "హర్మన్ ఔట్​ పట్ల అంపైర్లు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. బంతి బ్యాట్​కు స్పష్టంగా తగిలింది. కానీ ఈ సిరీస్​లో రివ్యూలు లేవు. మేము విజయానికి ఒక్క పరుగు దూరంలోనే ఆగిపోయాం. ఈ వివాదస్పద ఔట్​ పట్ల ఐసీసీ, బీసీసీఐ, బీసీబీ చర్యలు తీసుకుంటాయని అనుకుంటున్నాను" అని స్మృతి తెలిపింది.

Last Updated : Jul 23, 2023, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.