ETV Bharat / sports

నాకు ఆ హక్కు ఉంది.. నేను ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదు : హర్మన్​ప్రీత్ కౌర్

author img

By

Published : Aug 20, 2023, 8:42 PM IST

Updated : Aug 20, 2023, 9:38 PM IST

Harmanpreet Kaur Feels No Regret : బంగ్లాదేశ్ పర్యటనలో జరిగిన వివాదానికి తాను చింతించడం లేదని తెలిపింది టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్. ఈ మేరకు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు హర్మన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే..

Harmanpreet Kaur Feels No Regret
Harmanpreet Kaur Feels No Regret

Harmanpreet Kaur Feels No Regret : టీమ్ఇండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్​​.. బంగ్లాదేశ్ పర్యటనలో​ తన ప్రవర్తన కారణంగా రెండు మ్యాచ్​ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న 100 బాల్ మహిళల టోర్నీలో ట్రెంట్ రాకెట్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోంది హర్మన్. ఈ క్రమంలో శనివారం ట్రెంట్ రాకెట్స్​, బర్మింగమ్ ఫినిక్స్​తో తలపడింది. కాగా మ్యాచ్ అనంతరం ప్రెస్​మీట్​లో వివాదం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చింది.

బంగ్లాదేశ్ పర్యటనలో చివరి వన్డే మ్యాచ్​లో ఆ విషయంలో పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదని హర్మన్ చెప్పింది. "జరిగిన దానికి నేను పశ్చాత్తాపం చెందడం లేదు. ఎందుకంటే ఏ ప్లేయరైనా​ గ్రౌండ్​లో సరైన నిర్ణయాలనే చూడాలనుకుంటారు. అంతేకాకుండా సొంత ఫీలింగ్స్​ను వ్యక్తపరిచేందుకు ప్రతి ప్లేయర్​కు హక్కు ఉంటుంది. అలాగే నేను ఏ క్రీడాకారిణితోనూ, ఏ వ్యక్తితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. కేవలం మైదానంలో జరిగిందే చెప్పాను అంతే. దానికి నేను చింతించను" అని హర్మన్ తెలిపింది.

ఇదీ వివాదం.. గతనెల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్ ఆడింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్​లో 33.4 ఓవర్​ వద్ద హర్మన్​.. బంగ్లా బౌలర్ నహిద అక్తర్ వేసిన టాస్​ బంతిని స్వీప్ చేయబోయింది. బంతి బ్యాట్ అంచున ముద్దాడి.. ఆమె లెగ్ ప్యాడ్స్​కు తగిలింది. దీంతో బంగ్లా బౌలర్లు అప్పీల్ చేయకముందే.. ఫీల్డ్ అంపైర్​ హర్మన్​ను ఔట్​గా ప్రకటించారు.

అంతే తాను ఔట్ కాదంటూ.. హర్మన్ పట్టరాని కోపంతో స్టంప్స్​ను బలంగా కొట్టి, అంపైర్​ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా మ్యాచ్​ ప్రజెంటేషన్​ సమయంలో అంపైర్లను ఉద్దేశించి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది హర్మన్.

కాగా ఆమె క్రమశిక్షణ నిబంధనలు ఉల్లఘించినట్లు మ్యాచ్ రిఫరీ భావించాడు. దీంతో హర్మన్​కు 75 శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించారు. రూల్స్ ప్రకారం ఏ ప్లేయరైనా మూడు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. రెండు అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరమవుతారు. ఈ క్రమంలో హర్మన్ సెప్టెంబర్​లో జరిగే ఆసియా క్రీడల్లో తొలి రెండు మ్యాచ్​లు బెంచ్​కు పరిమితమం కానుంది.

కోపంతో ఊగిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్.. అవమానించారంటూ..

హర్మన్​ బ్యాన్​పై అప్పీల్​! కెప్టెన్​ నుంచి వివరణ కోరనున్న బీసీసీఐ!

Last Updated : Aug 20, 2023, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.