ETV Bharat / sports

బీసీసీఐపై ఆరోపణలు.. తోసిపుచ్చిన హర్మన్, మిథాలీ - బీసీసీఐపై ఆరోపణలు

సామాజిక మాధ్యమాల వేదికగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)పై వస్తోన్న ఆరోపణలను మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్​ తోసిపుచ్చారు. పురుషుల జట్టుకు కల్పించిన సౌలభ్యాలను మహిళల టీమ్​ విషయంలో బీసీసీఐ విస్మరిస్తోందని విమర్శలు వచ్చాయి.

bcci, Harmanpreet Kaur, Mithali Raj
బీసీసీఐ, హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్
author img

By

Published : May 18, 2021, 7:50 PM IST

ఇంగ్లాండ్​ పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ).. పురుషుల, మహిళల జట్ల మధ్య పక్షపాత ధోరణి చూపుతోందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను మహిళ క్రికెటర్లు హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్​ తోసిపుచ్చారు.

ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్​ కూడా యూకే వెళ్లనుంది. అంతకు ముందే క్రికెటర్లందరూ క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. పురుషుల జట్టు ముంబయికి రావడానికి ఛార్టర్​ ఫ్లైట్స్​ ఏర్పాటు చేసిన బీసీసీఐ.. మహిళలను విస్మరించిందని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆర్​టీపీసీఆర్​ టెస్టుల నిర్వహణ విషయంలోనూ ఇదే విధంగా వివక్ష చూపిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు.

ఈ విషయంపై ట్విట్టర్​ వేదికగా స్పందించారు హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్. "ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ఆటగాళ్లందరికీ ముంబయి వెళ్లడానికి బీసీసీఐ ఛార్టర్​ ఫ్లైట్లు ఏర్పాటు చేసింది. ఆటగాళ్లు ఉండే దూరం, వ్యక్తిగత సౌలభ్యం బట్టి ఎలా రావాలన్న విషయం వారి సొంతానికే వదిలేసింది," అని హర్మన్ ట్వీట్ చేసింది.

"మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బంది. అయినప్పటికీ, బీసీసీఐ చేస్తున్న ఏర్పాట్లు చూస్తే మేము సురక్షితంగా వెళ్తామనే భరోసా కలుగుతోంది," అని మిథాలీ ట్వీట్ చేసింది.

  • Why do the men get charter flights to reach Mumbai, but (most of) the women have to travel via commercial flights? On what basis are these things decided? pic.twitter.com/ZQniClOTo4

    — Ananya Upendran (@a_upendran11) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The BCCI has organised Charter flights to ferry both men and women players to Mumbai before we leave for the UK. Considering the distance and individual convenience players have made their own choice.

    — Harmanpreet Kaur (@ImHarmanpreet) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Traveling is a challenge in the pandemic but it is reassuring to see elaborate measures by BCCI for our health and safety. A charter ✈️ to Mumbai and UK and regular RT-PCR Tests at home. #LetsDoThis

    — Mithali Raj (@M_Raj03) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: బాల్​ ట్యాంపరింగ్: దిద్దుబాటు చర్యల్లో ప్లేయర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.