ETV Bharat / sports

Hardik ODI World Cup : హార్దిక్‌.. ఇలాగే రెచ్చిపో.. ఎక్కడా తగ్గకు విజయం మనదే!

Hardik Pandya World Cup 2023 : 2018 ఆసియా కప్​ సమయంలో వెన్ను నొప్పితో బాధపడ్డాడు ఆ ఆల్‌రౌండర్‌. బౌలింగ్, బ్యాటింగ్‌.. రెండింటిలోనూ తడబడ్డాడు. గాయం కారణంగా ఆటకే దూరమయ్యాడు. కట్‌ చేస్తే.. రీసెంట్​గా ముగిసిన 2023 ఆసియా కప్​లో మెరుపులు మెరిపించాడు. వన్డే వరల్డ్ కప్​ ముందు టీమ్​లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అతడే.. హార్దిక్‌ పాండ్య. మునుపటి జోరు ప్రదర్శిస్తున్నాడు. వచ్చే నెల 5న భారత్‌ వేదికగా ప్రారంభంమయ్యే వన్డే వరల్డ్​ కప్‌లో హార్దిక్‌ ఇదే ఫామ్​ను కొనసాగిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 8:06 AM IST

Hardik ODI World Cup : హార్దిక్‌.. ఇలాగే రెచ్చిపో.. ఎక్కడా తగ్గకు విజయం మనదే!
Hardik ODI World Cup : హార్దిక్‌.. ఇలాగే రెచ్చిపో.. ఎక్కడా తగ్గకు విజయం మనదే!

Hardik Pandya World Cup 2023 : గత కొద్దికాలంగా హార్దిక్​ బౌలింగ్, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ మళ్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు హార్దిక్​ పాండ్య. రీసెంట్​గా జరిగిన ఆసియా కప్‌లో హార్దిక్‌ ఆడిన విధానం.. వరల్డ్ కప్​నకు ముందు టీమ్​కు భరోసాను, అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ మినీ టోర్నీలో రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేశాడతడు. 46 యావరేజ్​తో 92 పరుగులు చేయగలిగాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో జట్టు కష్టాల్లో పడినప్పుడు 90 బంతుల్లో 87 పరుగులతో రాణించాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దైంది కానీ.. హార్దిక్‌ బ్యాటింగ్‌ హైలైట్​గా నిలిచింది. బౌలింగ్‌లో 4 ఇన్నింగ్స్‌లో 11.33 యావరేజ్​ 6 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 3.34గా ఉండటమే అతడి మెరుగైన ఆటకు నిదర్శనం. శ్రీలంకతో జరిగిన ఫైనల్​లో మూడు వికెట్లతో లోయర్‌ ఆర్డర్‌ నడ్డి విరిచాడు. ప్రధాన బ్యాటర్లను పెవిలియన్​కు పంపినా లోయర్​ ఆర్డర్​ను ఎదుర్కోలేక.. భారత్‌ ఎన్నో మ్యాచుల్లో మంచి అవకాశాలను మిస్ చేసుకుంది. కానీ ఈ సారి హార్దిక్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు.

Hardik Surgery : 2018 ఆసియా కప్‌ టైమ్​లోనే హార్దిక్‌ వెన్నెముక గాయం బారిన పడ్డాడు. ఆ నొప్పితోనే 2019 వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగాడు. కానీ పూర్తి స్థాయిలో రాణించ లేకపోయాడు. ఇక ఆ టోర్నీ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో వెన్నెముక సర్జరీ చేయించుకున్నాడు. చాలా సమయం తర్వాత కోలుకుని.. తిరిగి క్రికెట్లో అడుగుపెట్టినా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. దీంతో అతడి కెరీర్‌ ఆరంభంలో మరో కపిల్‌ దేవ్‌ అవుతాడని పెట్టుకున్న అంచనాలు తప్పాయా? ఇకపై కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతాడా? అన్న సందేహాలు వచ్చాయి.

కానీ 2022 ఐపీఎల్‌తో అవన్నీ మారిపోయాయి. ఆ ఏడాదే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్‌ అదరగొట్టేశాడు. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం.. టాప్‌ ఆర్డర్‌లో వచ్చి పరుగులు సాధించడంతో తిరిగి తన పాత ఫామ్​ను అందిపుచ్చుకున్నాడు. ఆ ఏడాది తన టీమ్​ను ఛాంపియన్‌గా నిలిపాడు.

ఈ సారి కూడా ఐపీఎల్​లో తన జట్టును ఫైనల్​కు తీసుకెళ్లాడు. కానీ ఫైనల్​లో చెన్నై చేతిలో గుజరాత్‌ ఓడిపోయింది. పాత హార్దిక్‌లా మారేందుకు ఐపీఎల్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోనూ దూకుడుతో ఆడుతున్నాడు. గత రెండేళ్లలో బౌలింగ్‌ మెరుగుపర్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఇలా బెస్ట్​ స్పెల్‌లు వేస్తున్నాడు. పరుగులు చేస్తున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు.

దీంతో ఈ సారి వరల్డ్ కప్​ టీమ్​ఇండియా హార్దిక్‌ కీలకంగా మారతాడు అని అంతా భావిస్తున్నారు. ఈ ఏడాది వన్డేల్లోనూ అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు. 2023లో ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లో 372 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌లో 16 వికెట్లు తీశాడు. ఈ వరల్డ్ కప్​లో అతడు ఫిట్‌గా ఉంటూనే.. ఐదారు ఓవర్లు బెస్ట్​గా బంతులు సంధించడంతో పాటు టాప్‌-6లో బ్యాటింగ్‌ చేస్తూ మెరుపులు మెరిపిస్తే జట్టుకు చాలా ఉపయోగపడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.