ETV Bharat / sports

Hardik pandya World Cup 2023 : బిగ్​ షాక్​.. మరో రెండు మ్యాచ్​లకూ హార్దిక్ దూరం..

Hardik pandya World Cup 2023 : గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్​ పాండ్య రానున్న మ్యాచ్​లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Hardik pandya World Cup 2023
Hardik pandya World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 1:26 PM IST

Hardik pandya World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా ఇటీవలే బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్​కు దూరమైన హార్దిక్​ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే వచ్చే ఆదివారం (అక్టోబర్ 29న) ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. బీసీసీసీఐ వర్గాలు కూడా హార్దిక్‌ బరిలోకి దిగుతాడని వ్యక్తం చేశాయి. అయితే, తాజాగా హార్దిక్‌ రీఎంట్రీపై ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. రానున్న మ్యాచ్​తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో (నవంబర్ 2న) జరిగే మ్యాచ్‌కూ హార్దిక్​ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఎన్​సీఏలో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్​ ప్రస్తుతం వేగంగానే కోలుకుంటున్నాడట. అయినప్పటికీ అతడి విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరి కొద్ది రోజులు హార్దిక్​ మ్యాచ్​కు దూరం కానున్నాడని తెలిసింది.

మరోవైపు వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న రోహిత్​ సేన.. లఖ్​నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ జట్టును మట్టికరిపిస్తే ఇక టీమ్ఇండియా దాదాపు సెమీస్‌కు చేరడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక లీగ్‌ దశలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించాలనే కసితోనే భారత్​ సేన కూడా ఆడుతోంది. దీంతో రానున్న మ్యాచ్​లనూ భారత్​దే పైచేయి అవ్వడం ఖాయమవ్వనుంది.

కివీస్‌తో జరిగిన మ్యాచ్​కు హార్దిక్‌ దూరం కావడం వల్ల అతని స్థానంలో మేనేజ్​మెంట్​ సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకుంది. అయితే కివీస్​ మ్యాచ్​లో సూర్యకుమార్​ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు హార్దిక్‌ గైర్హాజరీలో ఇంగ్లాండ్‌పై జరగనున్న మ్యాచ్‌లో సూర్యకు మరో అవకాశం రావడం దాదాపు ఖాయం. దీంతో ఈ సారైన సూర్యకుమార్​ మెరుపులు మెరిపిస్తే బాగున్ను అని ఫ్యాన్స ఆశిస్తున్నారు.

లఖ్‌నవూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటం వల్ల రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సిరాజ్‌కు బదులు అశ్విన్‌ తుది జట్టులోకి రావొచ్చు. షమీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో రానున్న మ్యాచ్​లో అతడిని పక్కన పెట్టడం కష్టమే. ఈ మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ ఆడనుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా.

  • All-rounder Hardik Pandya likely two miss India's next two World Cup matches against England and Sri Lanka: Sources #CWC2023 #TeamIndia

    — Press Trust of India (@PTI_News) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI World Cup 2023 Players Injuries : సెమీస్​ రేసులో భయపెడుతున్న ఆటగాళ్ల గాయాలు.. జట్లకు పెద్ద షాక్​లు!

Hardik Pandya World Cup 2023 : టీమ్ఇండియాకు షాక్.. హార్దిక్​కు గాయం.. ఫీల్డ్ నుంచి ఔట్.. బీసీసీఐ ఏం చెప్పిందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.