న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేయడం వల్ల 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 111 పరుగులతో సూపర్ సెంచరీ చేసి మెరిశాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాత్కాలిక కెఫ్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో మరిన్ని బౌలింగ్ ఆప్షన్లు చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రతిసారి బౌలర్లే రాణించాలంటే కుదరని.. బౌలింగ్ చేయగల బ్యాటర్లు జట్టులో ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సూపర్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ వల్లే ఈ ఘన విజయం సాధించామని చెప్పాడు.
"ఈ మ్యాచ్‌లో బౌలర్లు మంచిగా రాణించారు. అగ్రేసివ్ మైండ్‌సెట్‌తో ఆడారు. అయితే అగ్రెసివ్ అంటే ప్రతి బాల్‌కు వికెట్ తీయడమని కాదు.. దూకుడుగా బౌలింగ్ చేయడం ముఖ్యం. పరిస్థితులు బౌలర్లకు ప్రతికూలంగానే ఉన్నాయి. బంతి తడిగా మారింది. అయినా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను చాలా బాగా బౌలింగ్ చేశాను. ఇక జట్టులో మరిన్ని బౌలింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటున్నా. ప్రతిసారి బౌలర్లే రాణించాలంటే కుదురదు. కాబట్టి బౌలింగ్ చేయగల బ్యాటర్లు జట్టులో ఉండాలనుకుంటున్నా. ప్రోఫెషనల్ ఆల్‌రౌండర్ల కోసం వేచి చూస్తున్నా"
-హార్దిక్ పాండ్య, కెప్టెన్
అయితే టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో టీమ్ ఇండియాలో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ఆ తర్వాత కొత్త సెలెక్షన్ కమిటీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అంతేకాకుండా వేర్వేరు కెప్టెన్ల పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసి 2024 టీ20 ప్రపంచకపే లక్ష్యంగా జట్టును సిద్దం చేయాలనుకుంటున్నట్లు క్రీడా వర్గాల సమాచారం. హార్దిక్ ఫుల్‌టైమ్ టీ20 కెప్టెన్ బాధ్యతలు ఇస్తే జరిగే నష్టం ఏం లేదని టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా తన అభిప్రాయం తెలిపారు. అయితే వేర్వేరు కెప్టెన్ల పద్ధతిని పాటిస్తే టీ20 ఫార్మాట్‌కు హార్దిక్‌ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లకు సారథిగా ఉన్న.. రోహిత్ శర్మను అలాగే కొనసాగించే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి : 'మీరు ఆడితే లోకమే ఊగదా'.. కేరళను ఊపేస్తున్న సాకర్ ఫీవర్!
సూర్య సూపర్ సెంచరీ.. కివీస్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా బోణీ