Hardik Pandya Mumbai Indians : 2024 ఐపీఎల్ వేలానికి సంబంధించి ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న, వదులుకున్న ప్లేయర్లను ప్రకటించాయి. గుజరాత్ టైటన్స్ జట్ట తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యను.. అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది. దీంతో అతడు ముంబయి ఇండియన్స్‌కు తిరిగి వెళ్తాడనే వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
కానీ, కొన్ని గంటల్లోనే సంచలనం జరిగింది. హార్దిక్ గుజరాత్‌ను వదిలి మళ్లీ ముంబయితో చేరనున్నట్లు సమాచారం అందింది. 2022 ఐపీఎల్లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ హార్దిక్.. రానున్న సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు ఆడనున్నాడు. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య ఓప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
ట్రేడింగ్ ఇలా.. అయితే ముంబయి యాజమాన్యం.. హార్దిక్‌కు వార్షిక జీతంతోపాటు, గుజరాత్‌కు కూడా భారీ మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పిందట. కానీ, అది ఎంత మొత్తమో బయటకు రాలేదు. అయితే ముంబయి, గుజరాత్‌కు ఎంత ఇచ్చినా.. అందులో 50 శాతం హార్దిక్‌కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక యాధావిధిగా హార్దిక్‌కు ముంబయి.. జీతం రూపంలో ఏడాదికి రూ. 15 కోట్లు చెల్లించనుంది.
గ్రీన్ పోయే హార్దిక్ వచ్చే.. ముంబయి జట్టులో మరో కీలక మార్పు జరిగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను బెంగళూరుకు ఇచ్చేసింది. గత వేలంలో ముంబయి గ్రీన్‌ను రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. హార్దిక్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు ముంబయి పర్స్‌లో తగినంత డబ్బు లేకపోవడం వల్ల.. గ్రీన్‌ను ఆర్సీబీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్చర్, మెరెడిత్, రిచర్డ్‌సన్, జోర్డాన్ తదితర ఆటగాళ్లను ముంబయి వదులుకుంది.
-
Mumbai Indians paying 15 cr to Gujrat Titans for Hardik Pandya.
— ANSHUMAN🚩 (@AvengerReturns) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
They are not trading with any player. So one is gone till now. pic.twitter.com/isxSvUBqqg
">Mumbai Indians paying 15 cr to Gujrat Titans for Hardik Pandya.
— ANSHUMAN🚩 (@AvengerReturns) November 24, 2023
They are not trading with any player. So one is gone till now. pic.twitter.com/isxSvUBqqgMumbai Indians paying 15 cr to Gujrat Titans for Hardik Pandya.
— ANSHUMAN🚩 (@AvengerReturns) November 24, 2023
They are not trading with any player. So one is gone till now. pic.twitter.com/isxSvUBqqg
-
Gujrat Titans after trading Hardik Pandya to Mumbai Indians.#IPLTrade #IPL2024Auction pic.twitter.com/E5h98H28lq
— Abhiraj Thakur (ADM) (@aandy_sain) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujrat Titans after trading Hardik Pandya to Mumbai Indians.#IPLTrade #IPL2024Auction pic.twitter.com/E5h98H28lq
— Abhiraj Thakur (ADM) (@aandy_sain) November 25, 2023Gujrat Titans after trading Hardik Pandya to Mumbai Indians.#IPLTrade #IPL2024Auction pic.twitter.com/E5h98H28lq
— Abhiraj Thakur (ADM) (@aandy_sain) November 25, 2023
-
Traded Hardik Pandya for 15cr from GT and trading Cameron Green (17.5cr) to RCB
— CricBeat (@Cric_beat) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Saves 2.5 CR 🫡 pic.twitter.com/njyqXDcvXo
">Traded Hardik Pandya for 15cr from GT and trading Cameron Green (17.5cr) to RCB
— CricBeat (@Cric_beat) November 26, 2023
Saves 2.5 CR 🫡 pic.twitter.com/njyqXDcvXoTraded Hardik Pandya for 15cr from GT and trading Cameron Green (17.5cr) to RCB
— CricBeat (@Cric_beat) November 26, 2023
Saves 2.5 CR 🫡 pic.twitter.com/njyqXDcvXo
అశ్విన్, రహానే తర్వాత.. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు.. రవిచంద్రన్ అశ్విన్, అంజిక్యా రహానే తర్వాత కెప్టెన్‌ను కొనుగోలు చేయడం ఇది మూడోసారి. 2020లో పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ దిల్లి క్యాపిటల్స్ జట్టుకు ట్రేడవగా.. అదే ఏడాది రాజస్థాన్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. దిల్లికే అమ్ముడయ్యాడు. కానీ, హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్. అశ్విన్, రహానే కెప్టెన్సీలో వారి జట్లు టైటిల్ సాధించలేదు.
పాక్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ!- ఇండియా రానంటే మాకు పరిహారం చెల్లించాలి : పాకిస్థాన్
గుజరాత్ జట్టులోనే హార్దిక్- ఐపీఎల్ 2024కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్లు వీరే!