Hardik Pandya Jamnagar Welcome : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పాండ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ విజిట్‌లో భాగంగా డిసెంబర్ 19న గుజరాత్ జామ్‌నగర్ వెళ్లాడు. అయితే అక్కడ పాండ్యకు ఘన స్వాగతం లభించింది. ఇండస్ట్రీ గేట్ బయట పాండ్యకు గుర్రాలు, బ్యాండ్ బాజాతో స్వాగతం పలికారు. అయితే ఆలస్యంగా వెలులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.
Hardik Pandya Ruled Out : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, 2024 జనవరిలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోనందున అతడు ఇంకొన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు. అయితే మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ ఉన్నందున హార్దిక్‌ను ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించడానికి బీసీసీఐ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Hardik Pandya Mumbai Indians : ట్రేడింగ్ పద్ధతిలో హార్దిక్ పాండ్య ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. కాగా, అతడికి ఫ్రాంచైజీ యాజమాన్యం కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న పాండ్య, 2024 ఐపీఎల్‌లోనూ ఆడటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
A grand welcome of Hardik Pandya in Jamnagar.#HardikPandya #RohitSharma #ViratKohli #KLRahul #SAvIND #AUSvPAK #AnanyaPanday #DeepikaXTECNO #MaheshBabu #BoxingDay #TestCricket #WTC25
— Raj Paladi (@IamRajPaladi) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/VlISiQcoaL
">A grand welcome of Hardik Pandya in Jamnagar.#HardikPandya #RohitSharma #ViratKohli #KLRahul #SAvIND #AUSvPAK #AnanyaPanday #DeepikaXTECNO #MaheshBabu #BoxingDay #TestCricket #WTC25
— Raj Paladi (@IamRajPaladi) December 27, 2023
pic.twitter.com/VlISiQcoaLA grand welcome of Hardik Pandya in Jamnagar.#HardikPandya #RohitSharma #ViratKohli #KLRahul #SAvIND #AUSvPAK #AnanyaPanday #DeepikaXTECNO #MaheshBabu #BoxingDay #TestCricket #WTC25
— Raj Paladi (@IamRajPaladi) December 27, 2023
pic.twitter.com/VlISiQcoaL
దాదాపు రూ.100 కోట్లు!
అయితే హార్దిక్ పాండ్య కోసం గుజరాత్ టైటాన్స్‌కు ముంబయి ఇండియన్స్ భారీ బదిలీ రుసుమును చెల్లించిందని తెలుస్తోంది. ఈ స్టార్ ఆల్‌రౌండర్ కోసం దాదాపు రూ.100 కోట్లు చెల్లించిందని సమాచారం. 2021 ఐపీఎల్‌లో భాగం కావడానికి గుజరాత్ టైటాన్స్ సీవీసీ క్యాపిటల్‌గా రూ.5625 కోట్లు వెచ్చించింది. అయితే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ బలమైనది. ముంబయి ఫ్రాంచైజీలో వ్యాపార దిగ్గజాలు ఉన్నారు.
-
Hardik Pandya has been ruled out from the Afghanistan T20I series. (Sports Tak) pic.twitter.com/OKB5a7rhOg
— Vishal. (@SPORTYVISHAL) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hardik Pandya has been ruled out from the Afghanistan T20I series. (Sports Tak) pic.twitter.com/OKB5a7rhOg
— Vishal. (@SPORTYVISHAL) December 27, 2023Hardik Pandya has been ruled out from the Afghanistan T20I series. (Sports Tak) pic.twitter.com/OKB5a7rhOg
— Vishal. (@SPORTYVISHAL) December 27, 2023
రూ.15కోట్లు పెరిగిన పర్స్ వ్యాల్యూ
హార్దిక్ పాండ్య వదులుకోవడంతో ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ పర్స్ వ్యాల్యూ రూ.15 కోట్లు పెరిగింది. కానీ ముంబయి బదిలీ రుసుము ఎంత మొత్తం చెల్లించిందనే విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో సీవీ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్‌లో అది కనిపించనుంది
రోహిత్ కెప్టెన్సీలో స్టార్లుగా మారిన క్రికెటర్లు- పాండ్యనే ఫస్ట్!!