Harbhajan Singh: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. వార్న్‌ను క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. తనతో సహా ఒక తరానికి ప్రేరణగా నిలిచాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా 2001లో ఇండియా పర్యటనకు వచ్చినపుడు జరిగిన సంఘటన గురించి భజ్జీ తెలిపాడు.
"చెన్నైలో జరుగుతున్న మూడో టెస్టులో స్టీవ్ వాతో కలిసి వార్న్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వార్న్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా.. నా రన్‌అప్‌లో ఉండి అతడినే చూస్తు నిలబడ్డా. వార్న్ వచ్చి 'ఏమైనా సమస్యా' అని అడిగాడు. దీంతో అతడి దగ్గరికి వెళ్లి 'నా పక్కనే ఉన్న నా హీరోను ఆరాధిస్తున్నాను. ఇదంతా ఒక కలగా అనిపిస్తుంది. మీతో కలిసి ఆడటం గొప్ప అనుభూతి' అని చెప్పా. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. నేను ఆ సిరీస్‌లో 32 వికెట్లు తీసినప్పుడు కూడా నన్ను అభినందించాడు."
-హర్భజన్ సింగ్, భారత మాజీ క్రికెటర్
52 ఏళ్ల షేన్ వార్న్ గుండెపోటుతో మార్చి 4న థాయ్‌లాండ్‌లోని సముయ్ ఐలాండ్‌లో మరణించాడు. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: Ipl 2022 Ricky Ponting: 'ఆ బాధ్యతంతా రిషభ్ పంత్‌పైనే'