ETV Bharat / sports

రాజకీయాలపై హర్భజన్ సింగ్​కు నో క్లారిటీ - రాజకీయాలపై హర్భజన్ సింగ్ క్లారిటీ

Harbhajan Singh Politics: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ పంజాబ్​ కాంగ్రెస్​లో చేరతాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయంలోకి వచ్చే అంశంపై స్పందించాడు భజ్జీ. సరైన సమయం వస్తే నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ఆటతోనే తనకు అనుబంధం ఎక్కవ ఉందని చెప్పాడు.

harbhajan singh
హర్భజన్ సింగ్
author img

By

Published : Jan 9, 2022, 5:24 PM IST

Harbhajan Singh Politics: టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. అయితే భజ్జీ రిటైర్మెంట్ అనంతరం అతడి సెకండ్ ఇన్నింగ్స్ గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. వ్యాఖ్యత, కోచ్​ లేదా మెంటార్​గా మారతాడని కొందరు అంటుంటే.. మరికొందరు రాజకీయాల్లోకి రాబోతున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించాడు హర్భజన్.

"తర్వాత ఏం చేయాలనేది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకుంటా. ఇంత పేరు సంపాదించానంటే దానికి కారణం క్రికెట్. అందుకే క్రికెట్​తో అనుబంధం కొనసాగించడమే ఇష్టం. ఐపీఎల్​ జట్టుకు మెంటార్​గానో, కోచ్​గానో ఉంటా. వీలైతే కామెంటరీ చేస్తా. రాజకీయాల్లోకి వెళ్తానా? లేదా? అనేదానిపై ఇప్పుడే ఏం చెప్పలేను"

-- హర్భజన్ సింగ్, మాజీ స్పిన్నర్.

Harbhajan Singh News: సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలా? లేదా? అనేదానిపై ఆలోచిస్తానని చెప్పాడు భజ్జీ. రాజకీయాల గురించి పూర్తిగా అవగాహనలేదని తెలిపాడు. అయితే.. రిటైర్మెంట్ అనంతరం హర్భజన్.. పంజాబ్​ కాంగ్రెస్ చీఫ్ నవ్​జ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ కాంగ్రెస్​లో చేరతాడనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

అంతర్జాతీయ కెరీర్​లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు హర్భజన్. ఇతడు మొత్తంగా 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (687), రవి అశ్విన్ (638), జహీర్ ఖాన్ (597) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి:

రాజకీయాల్లోకి రావడంపై హర్భజన్ సింగ్ క్లారిటీ

'దూస్రా కింగ్​'ను చూస్తే దిగ్గజాలకే హడల్​

'నన్ను ఎందుకు తప్పించారో తెలియదు'.. భజ్జీ షాకింగ్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.