ETV Bharat / sports

క్రికెటర్ హర్భజన్​కు పుత్రోత్సాహం.. భావోద్వేగ ట్వీట్​ - harbhajan singh latest updates

సీనియర్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్(Harbhajan singh) తీపికబురు వినిపించాడు. తన​ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ భావోద్వేగ ట్వీట్​ చేశాడు. ఈ సారి ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ తరఫున భజ్జీ ఆడుతున్నాడు.

harbhajan singh
హర్భజన్​ సింగ్​
author img

By

Published : Jul 10, 2021, 3:21 PM IST

Updated : Jul 10, 2021, 5:21 PM IST

టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్(Harbhajan singh)​ మరోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య గీత బాస్రా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తెలియజేస్తూ భావోద్వేగ ట్వీట్​ చేశాడు.

"మేం పట్టుకునేందుకు ఇంకో చిన్నారి చేయి మా ఇంట్లోకి వచ్చింది. అతని ప్రేమ అమితమైనది. బంగారం అంతటి విలువైనది. ఇదో అద్భుతమైన బహుమతి. ఇదెంతో మధురమైనది, ప్రత్యేకమైనది కూడా. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మా జీవితాలు సంపూర్ణమయ్యాయి. మాకు మగబిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా భార్య, చిన్నారి క్షేమంగా ఉన్నారు. ఈ ఆనందంతో మేం ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాం. ఈ సందర్భంగా మా మంచి కోసం ఆలోచించే ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ హర్భజన్ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

2015లో గీత బాస్రా, హర్భజన్​ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తొలి సంతానం ఆడపిల్ల. ప్రస్తుతం టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భజ్జీ.. ఈ సీజన్​ ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడుతున్నాడు. త్వరలోనే తమిళ సినిమా 'ఫ్రెండ్​షిప్'​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇదీ చూడండి: Harbhajan Singh: ఆ ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్

Last Updated : Jul 10, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.