టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేడు 41వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతనికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. సుదీర్ఘ కాలం పాటు భారత స్పిన్ విభాగానికి సేవలందించిన భజ్జీ.. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కొనసాగుతున్నాడు. 1998లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన ఈ పంజాబ్ బౌలర్.. అదే ఏడాది కివీస్‌పై వన్డేల్లోకి అడుగుపెట్టాడు. అతని బర్త్‌డే సందర్భంగా అతడు సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి.
భజ్జీ తన కెరీర్లో 103 టెస్టులతో పాటు 236 వన్డేలు, 28 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 417 వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. 50 ఓవర్ల ఫార్మాట్లో 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే తర్వాత అత్యంత విజయవంతమైన స్పిన్నర్ భజ్జీనే కావడం విశేషం. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన భారత జట్టులో హర్భజన్ సభ్యుడు. నాలుగు సార్లు ఐపీఎల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు.
-
2007 World T20 & 2011 World Cup-winner 🏆 🏆
— BCCI (@BCCI) July 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
1⃣st Indian to scalp a Test hat-trick 🔝
367 intl. games, 711 intl. wickets & 3,569 intl. runs 👌
Here's wishing @harbhajan_singh - one of the finest to represent #TeamIndia - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/BLgoMkWB24
">2007 World T20 & 2011 World Cup-winner 🏆 🏆
— BCCI (@BCCI) July 3, 2021
1⃣st Indian to scalp a Test hat-trick 🔝
367 intl. games, 711 intl. wickets & 3,569 intl. runs 👌
Here's wishing @harbhajan_singh - one of the finest to represent #TeamIndia - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/BLgoMkWB242007 World T20 & 2011 World Cup-winner 🏆 🏆
— BCCI (@BCCI) July 3, 2021
1⃣st Indian to scalp a Test hat-trick 🔝
367 intl. games, 711 intl. wickets & 3,569 intl. runs 👌
Here's wishing @harbhajan_singh - one of the finest to represent #TeamIndia - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/BLgoMkWB24
తొలి హ్యాట్రిక్ భజ్జీదే..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీతో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్ తర్వాత మరో హీరో భజ్జీనే. ఈ టెస్టులో హ్యాట్రిక్‌తో మెరిసిన ఈ వెటరన్ స్పిన్నర్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు భజ్జీ పేరిటే ఉంది.
భజ్జీ@400..
2011 ముందు వరకు జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న హర్భజన్.. టెస్టుల్లో మొత్తంగా 417 వికెట్లు తీశాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆఫ్ స్పిన్నర్‌గా భజ్జీ రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక మెయిడెన్లు..
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు పండగ. అలాంటిది ఓ మ్యాచ్‌లో ఎక్కువ మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా భజ్జీ సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 2012 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు.. ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్‌మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు. రెండు ఓవర్లు మెయిడెన్‌గా వేశాడు. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 12 పరుగులే ఇచ్చి.. 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 80 పరుగులకే కుప్పకూలింది. తర్వాతి రోజుల్లో భువనేశ్వర్, బుమ్రా.. భజ్జీ సరసన చేరారు.
ఇదీ చదవండి: మహిళలపై కార్తీక్ అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణకు డిమాండ్