ETV Bharat / sports

'కోహ్లీ పరిపూర్ణ ఆటగాడు.. అది అతడికే మాత్రమే సాధ్యం' - కోహ్లీ టీ20 ప్రపంచకప్​ ఇన్నింగ్స్​

కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్రెగ్ చాపెల్​ ప్రశంసలు కురిపించాడు. పాకిస్థాన్​పై విరాట్ ఆడిన​ ఇన్నింగ్స్​ ఎంతో అద్భుతమైనదని అభివర్ణించాడు. ఇంకా ఏమన్నాడంటే..

Kohli Greg chapel
కోహ్లీ పరిపూర్ణ ఆటగాడు.. అది అతడికే మాత్రమే సాధ్యం
author img

By

Published : Oct 29, 2022, 7:43 PM IST

మెల్​బోర్న్​ వేదికగా జరిగిన భారత్​ పాక్ మ్యాచ్​లో అద్భుతం ఆవిష్కృతమైందన్న సంగతి తెలిసిందే. ఆ అద్భుతం పేరే విరాట్​ కోహ్లీ. ఫామ్​లోకి వచ్చిన తర్వాత మరోసారి తన సంచలన ఇన్నింగ్స్​తో జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్రెగ్ చాపెల్​​ విరాట్​పై ప్రశంసలు కురిపించాడు. అతడి ఇన్నింగ్స్​ను 'దేవుని పాట'గా అభివర్ణించాడు. కోహ్లీ పత్యర్థిని మట్టి కరిపించిన విధంగా గతంలో ఎవరూ చేయలేదని కితాబిచ్చాడు.

"ఇప్పటివరకు నేను చూసిన క్రికెటర్లలో కోహ్లీ మోస్ట్​ కంప్లీట్ భారత బ్యాటర్. గొప్ప ఆటగాళ్లకే తన లక్ష్యాలను నిజం చేసుకునే ధైర్యం, తెలివితేటలు ఉంటాయి. విరాట్​కు ఆ లక్షణాలు ఉన్నాయి. నిజానికి టైగర్​ పటౌడి కూడా ఇలాంటి స్థాయికి దగ్గరగా వచ్చాడు. ఓ పిల్లి పిల్లకు కొత్త ఉన్ని దారపు ఉండ దొరికితే ఎంత సంబరంగా ఆడుకుంటుందో, కోహ్లీ పాకిస్థాన్ బౌలింగ్​ను అదేవిధంగా ఆడుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ దేవుడి పాటలా ఉంది. ఇంతవరకు టీ20 ఇన్నింగ్స్​లో ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు. పటిష్ఠంగా ఉన్న పాక్​ బౌలింగ్​ను ఆట ఆడుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్​ టీ20 క్రికెట్​ను నిలిచిపోయేలా చేసింది. ఈ ఇన్నింగ్స్ ఎవరూ చేయలేరు. నేను క్రికెట్​ చూస్తున్నప్పటి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదు. ఈ ఇన్నింగ్స్​ తర్వాత టీ20 క్రికెట్​ను ఎవరూ తక్కువ అంచానా వేయలేరు." చాపెల్​ అని అన్నాడు.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాతో మ్యాచ్​.. అదొక్కటి అధిగమిస్తే టీమ్​ఇండియాకు తిరుగుండదంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.