ETV Bharat / sports

గొంగడి త్రిష.. భారత జట్టు ఆశాకిరణంగా హైదరాబాదీ! - ఆల్​రౌండర్​గా గొంగడి త్రిష

భారత మహిళా జట్టుకు మరో ఆశాకిరణం రాబోతుంది. అచ్చం షెఫాలీ వర్మలా దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్​లో అదరగొడుతున్న ఈమె.. బౌలింగ్​లోనూ మంచి ప్రతిభ కనబరుస్తోంది. అండర్-19 ప్రపంచకప్(under 19 world cup 2021)లో చోటే లక్ష్యంగా ఆడుతున్న ఈమె మరెవరో కాదు.. మన హైదరాబాదీ అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha).

Trisha
త్రిష
author img

By

Published : Nov 8, 2021, 10:09 AM IST

భారత మహిళా క్రికెట్ జట్టుకు మరో ఆశాకిరణం రాబోతోంది. ఆమె బ్యాట్ పట్టిందంటే పరుగుల వర్షమే.. బౌలింగ్ చేసిందంటే ప్రత్యర్థి బ్యాటర్​కు చెమటలు పట్టాల్సిందే. హైదరాబాద్​కు చెందిన గొంగడి త్రిష(gongadi trisha) ప్రస్తుతం ఆల్​రౌండర్​ ప్రతిభతో అదరగొడుతోంది. త్వరలో జరగబోయే అండర్-19 టీ20 వరల్డ్ కప్(under 19 world cup 2021) జట్టు కోసం బీసీసీఐ జల్లెడ పడుతున్న ఆటగాళ్లలో త్రిష ముత్యంలా కనిపిస్తోంది.

Gongadi Trisha
గొంగడి త్రిష

అండర్-19 ప్రపంచకప్​లో ఆడే అవకాశం..

తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన త్రిష(gongadi trisha) ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్(under 19 world cup 2021) మహిళల జట్టులో స్థానం దాదాపు ఖాయం చేసుకుంది. 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికైంది. బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రస్తుతం మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికకై ప్రత్యేక టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో భాగంగా ఇండియా-ఎ, ఇండియా-బి, ఇండియా-సి, ఇండియా-డి జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్​లు నిర్వహించింది. ఇందులో ఇండియా-బి జట్టుకు ఆడింది త్రిష. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అందరినీ ఆశ్యర్యపరిచింది. బౌలింగ్, బ్యాటింగ్​లో మంచి గణాంకాలు నమోదు చేసింది.

అత్యధిక వ్యక్తిగత స్కోరు..

Gongadi Trisha
గొంగడి త్రిష బ్యాటింగ్ స్టాట్స్

జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ(under 19 challenger trophy 2021)లో త్రిష మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ నెల 2న ఇండియా-ఎ తో జరిగిన మ్యాచ్​లో ఓపెనర్​గా 158 బంతుల్లో 112 పరుగులు చేసింది. ఇందులో 17 ఫోర్లు బాదింది. ఇండియా-డితో జరిగిన మ్యాచ్​లో 54 పరుగులు చేసింది. ఇండియా-డితో ఆదివారం (నవంబర్ 7) జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 116 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది త్రిష. 10 ఫోర్లు, 1సిక్సర్​తో విరుచుకుపడింది. ఈ టోర్నీలో మొత్తంగా 260 పరుగులు చేసిన త్రిష.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచింది. మిగిలిన ఏ ఒక్కరూ కూడా ఆమె దరిదాపుల్లో కూడా లేరంటే త్రిష ఏ విధంగా ఆడిందో తెలుసుకోవచ్చు. ఆమె తర్వాతి స్థానంలో 175 పరుగులతో ఇదే జట్టుకు చెందిన అనుష్క శర్మ ఉన్నారు. టోర్నీలో(under 19 challenger trophy 2021) ఒక శతకం కొట్టిన త్రిష.. రెండు అర్ధ శతకాలు నమోదు చేసింది. బౌలింగ్​లోనూ డాట్ బాల్స్, మెయిడిన్ ఓవర్స్ వేసి మంచి ఎకానమీ కనబర్చింది. దీంతో అందరి దృష్టి అమెపై పడింది. ఫైనల్ మ్యాచ్​లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష.. మూడు మెయిడిన్ ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఓ వికెట్ పడగొట్టింది.

ప్రత్యేకమైన బౌలింగ్ తీరు..

Gongadi Trisha
గొంగడి త్రిష బౌలింగ్ స్టాట్స్

లెగ్ స్పిన్ వేయడంలో ఆరితేరిన త్రిష.. అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్​తో అదరగొడుతోంది. ప్రస్తుతం అందరికంటే అత్యధిక పరుగులు చేసిన త్రిష.. బౌలింగ్ ఎకానమీలోనూ టాప్​లో ఉంది. బ్యాటింగ్​లో ఓపెనర్ స్థానంలో దూకుడుగా ఆడిన త్రిష.. అండర్-19 ప్రపంచ కప్​లోనూ భారీ స్కోర్లు చేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం భారత మహిళా జట్టుకు ఆడుతున్న షెపాలీ వర్మ(shefali varma stats) బ్యాటింగ్​లో మాత్రమే రాణిస్తున్నా.. అదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ బ్యాటర్ త్రిష.. బంతితో కూడా రాణిస్తూ ఆల్ రౌండర్ ప్రతిభతో అదరగొడుతోంది.

2020 లక్ష్యంగా పెట్టుకున్నా..

తనకు పుట్టిన అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. భారత జట్టుకు ఆడాలని ఆశించానని అందుకే త్రిషకు మూడేళ్ల నుంచి శిక్షణ ఇప్పిస్తున్నానని తండ్రి రామిరెడ్డి తెలిపారు. 2020 లోపు భారత జట్టుకు ఆడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. కరోనా వల్ల రెండేళ్లు జాప్యం అయిందన్నారు.

Gongadi Trisha
గొంగడి త్రిష

కాగా ప్రపంచ కప్​(under 19 challenger trophy 2021)కు ఇంకా సమయం ఉండగా నాలుగు జట్లలో మెరుగ్గా ఆడిన కొంత మందిని బీసీసీఐ ఎంపిక చేసి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అక్కడ వీరిని మెరికల్లా తయారు చేసి అండర్-19 ప్రపంచ కప్​కు సిద్ధం చేయనున్నారు.

ఇవీ చూడండి: వన్డే, టీ20 కెప్టెన్​గా రోహిత్​శర్మనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.