ETV Bharat / sports

'ఆ విషయంలో సచిన్, విరాట్‌ ఒక్కటే.. ఛాన్స్ ఇస్తే చెలరేగిపోతారు' - విరాట్ బౌలింగ్ లేటెస్ట్ న్యూస్

తొలి టెస్టులో ఓటమితో దిగాలుపడిన బంగ్లాదేశ్‌కు బౌలింగ్‌ కోచ్‌ అలెన్‌ డొనాల్డ్‌ కొన్ని సూచనలు చేశాడు. ఈ క్రమంలో విరాట్‌ ఆటతీరును సచిన్‌తో పోల్చాడు.

going-up-against-virat-kohli-is-like-bowling-to-sachin-tendulkar-says-allan-donald
విరాట్‌ కోహ్లీ, సచిన్‌ తెందూల్కర్‌
author img

By

Published : Dec 21, 2022, 9:43 PM IST

భారత క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ ఒక తరం వారు కాదు. కానీ ఇద్దరి ఆటతీరును సీనియర్లు, విశ్లేషకులు పోలుస్తూ ఉంటారు. రికార్డుల విషయంలోనూ అంతే. తాజాగా బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌ కూడా ఇదే మాట అన్నాడు. విరాట్‌ కోహ్లీకి బౌలింగ్‌ చేస్తే.. సచిన్‌ తెందూల్కర్‌కి బౌలింగ్‌ చేసినట్లు ఉంటుంది అని మెచ్చుకున్నాడు.

సచిన్‌కి ఒకసారి అవకాశం ఇచ్చామంటే.. ఇక చెలరేగిపోతాడు. విరాట్‌ కోహ్లీ కూడా అంతే. అందుకే అతనికి అవకాశం ఇవ్వొద్దు అంటూ బంగ్లా జట్టుకు సూచించాడు డొనాల్డ్‌. గురువారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టుకు టీమ్‌ని సిద్ధం చేస్తూ డొనాల్డ్‌ కీలక సూచనలు చేశాడు. "బంగ్లాతో తొలి టెస్టులో కోహ్లి ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక పరుగుకే పెవిలియన్‌ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలి"అని డొనాల్డ్‌ సూచించాడు.

"కోహ్లీ లాంటి ఆటగాళ్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. అతడిని వీలైనంత తొందరగా పెవిలియన్‌కు పంపేయాలి. లేదంటే అతణ్ని తట్టుకోవడం బౌలర్ల వల్ల కాదు. విరాట్ స్కోర్‌ పెరుగుతున్నప్పుడు ఏ చిన్న అవకాశాన్ని వదులుకున్నా కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే కోహ్లీ లాంటి ఆటగాళ్లు బౌలర్లకు పదే పదే అవకాశాలు ఇవ్వరు" అని కోహ్లీ ఆట గురించి చెప్పాడు డొనాల్డ్‌. "తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లను కట్టడి చేయగలిగాం. వీళ్లు క్రీజ్‌లో అడుగుపెడితే లావాతో బౌలింగ్‌ చేసినట్టు ఉంటుంది. అకస్మాతుగా మైదానంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో మ్యాచ్‌ చేతులు మారే అవకాశం ఉంటుంది" అని టీమ్‌ను సన్నద్ధం చేశాడు. ఈ సిరీస్‌ పూర్తయ్యేలోపు విరాట్‌ కచ్చితంగా సెంచరీ చేస్తాడు అని డొనాల్డ్‌ అంచనా వేశాడు.

కెప్టెన్‌ బౌలింగ్‌ చేస్తాడు..
తొలి టెస్టులో బంగ్లా బౌలింగ్‌ కష్టాలకు కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌ చేయకపోవడమూ ఓ కారణం. అయితే రెండో టెస్టులో అతను బౌలింగ్‌ చేస్తాడట. ఇది జట్టుకు శుభసూచకమే అని డొనాల్డ్‌ చెప్పాడు. తొలి టెస్టు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇటు షకిబ్‌, అటు ఎబాదత్‌ బౌలింగ్‌కి రాకపోవడంతో బంగ్లా బౌలర్లు బాగా ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.