ETV Bharat / sports

దేవుడా.. దయ చూపించు: అశ్విన్​ - కొవిడ్​పై అశ్విన్ ట్వీట్

ప్రతి ఒక్కరూ మాస్క్​లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచించాడు టీమ్​ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దేశంలో కొవిడ్​ ఉద్ధృతి చూసి భావోద్వేగానికి గురయ్యాడు. "దేవుడా కాస్త దయ చూపించు" అని ట్వీట్ చేశాడు.

R Ashwin
అశ్విన్, క్రికెటర్ అశ్విన్
author img

By

Published : May 13, 2021, 10:11 AM IST

దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న టీమ్​ఇండియా బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలిస్తున్నాడు. సూచనలకే పరిమితం కాకుండా ఎన్95 మాస్క్‌లు కొనుగోలు చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పంపిణీ చేస్తానని ఈ మధ్యే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.

  • Wake me up when all this is over, how many more people?? . Please mask up and remember not wearing a mask and not maintaining social distance will soon become a crime. God have some mercy🙏 #CovidIndia

    — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో కొవిడ్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని అశ్విన్ తాజాగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.'ఈ సంక్షోభమంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి. ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. దయచేసి మాస్క్‌ ధరించండి. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చు. దేవుడా కాస్తా దయ చూపించు' అని ట్వీట్ చేశాడు.

జూన్‌ 18-22 మధ్య సౌథాంప్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇందు కోసం బీసీసీఐ ఇటీవల జట్టులో కూడా ప్రకటించింది. దీంట్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా చోటు దక్కింది.

ఇదీ చదవండి:మహిళల జట్టు కోచ్​ రేసులో మళ్లీ పొవార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.