ETV Bharat / sports

వైరల్​: లైవ్​ క్రికెట్​ మ్యాచ్​లో దెయ్యం వికెట్​ తీసిందిలా!

author img

By

Published : Jul 28, 2021, 8:21 PM IST

Updated : Jul 28, 2021, 8:43 PM IST

బంగ్లాదేశ్‌-జింబాబ్వే మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో​ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎవరి ప్రమేయం లేకుండానే వికెట్ల మీద ఉండే బెయిల్స్ వాటంత‌ట అవే పడిపోయాయి. అయితే దీనికి కారణం దెయ్యాలు అంటూ సోషల్​మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

'Ghost' Takes Wicket During T20 Match Between Bangladesh And Zimbabwe!
వైరల్​: లైవ్​ క్రికెట్​ మ్యాచ్​లో దెయ్యం వికెట్​ తీసిందిలా!

పేదరాశి పెద్దమ్మ కథల్లో దెయ్యాల గురించి వినడమే తప్ప.. ఏనాడు బయట కనిపించిందే లేదు! అయితే ఈ కథల్లో దెయ్యాలు పాడుబడ్డ ఇళ్లు, మర్రిచెట్లు, శ్మశానాలకు వాటి ఖార్ఖానాలుగా మార్చుకొని నివసిస్తాయని వినికిడి. అయితే ఈ మధ్య కొన్ని మోడరన్​ దెయ్యాలు జనావాసాల్లోకి వస్తున్నాయట. అది కూడా ఓ అంతర్జాతీయ క్రికెట్​ మైదానంలో సందడి చేసి.. వికెట్​ కూడా పడగొట్టాయనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దెయ్యాలు క్రికెట్​ ఆడడం ఏంటి? వికెట్​ పడగొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే దాని అసలు కథ ఏందో మీరే చూడండి.

ఏం జరిగిందంటే?

జింబాబ్వే, బంగ్లాదేశ్​ మధ్య జరిగిన టీ20 మ్యాచ్​ ఈ విచిత్రమైన సంఘటనకు వేదికైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్​మన్​ ​మ‌హ‌మ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు.. వికెట్​పై ఉండే బెయిల్స్​లో​ ఒకటి పడిపోయింది. కానీ, వికెట్​కు బంతి తాకలేదు. ఇలా ఎలా జరిగిందబ్బా? అని మళ్లీ ఆ వీడియోను తరచి చూస్తే.. అందులో వికెట్​ దానంతట అదే వెనక్కి ఒరగడం సహా దానిపై బెయిల్​ కూడా పడిపోయింది. దాన్ని చూసిన వారంతా అక్కడ దెయ్యం ఉంది కావచ్చొని ప్రచారం చేశారు. అది గాలికి అలా జరిగిందా? లేదంటే దెయ్యాల పనేనా? అంటూ కొందరు సోషల్​మీడియాలో సరదాగా కామెంట్స్​ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో కొంచెం విచిత్రంగా ఉండడం వల్ల వైరల్​గా మారింది.

ఇదీ చూడండి.. INDvsSL: లంకతో మిగిలిన టీ20లకు వారందరూ దూరం

Last Updated : Jul 28, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.