ETV Bharat / sports

'ఓపెనర్​గా రాహుల్​ వద్దు.. ఇషాన్​ కిషన్​కు అవకాశమివ్వండి'.. గంభీర్​ సలహా - గౌతమ్​ గంభీర్​ కేఎల్​ రాహుల్​

టీమ్ఇండియా ఆటగాడు కేఎల్​ రాహుల్​పై మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంబీర్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఓపెనర్​గా ఆడించడాన్ని తప్పుబట్టాడు. అతడి ప్లేస్​లో మరో యువ క్రికెటర్​ను ఆడించాలని సూచించాడు. ఇంకా ఏమన్నాడంటే..

GAMBHIR ON RAHUL ISHAN
GAMBHIR ON RAHUL ISHAN
author img

By

Published : Jan 2, 2023, 6:51 AM IST

వన్డేల్లో రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ భాగస్వామిగా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషనే ఉండాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌లో రోహిత్‌కు తోడుగా రాహుల్‌ను ఆడించాలనుకుంటే అది సరైన నిర్ణయం అనిపించుకోదని అతనన్నాడు. బంగ్లాతో గత నెలలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.

''రోహిత్‌ భాగస్వామి ఎవరనే విషయంలో అసలు ఈ చర్చ ఎందుకు నడుస్తోందో నాకర్థం కావడం లేదు. ఇషాన్‌ గత ఇన్నింగ్స్‌లో ద్విశతకం సాధించాక ఈ చర్చేంటి? అంతటితో దీనికి ముగింపు పలకాలి. ఇషాన్‌ బంగ్లాదేశ్‌తో దాని సొంతగడ్డపై ఆడుతూ, నాణ్యమైన బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కొంటూ 35వ ఓవర్లోనే డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇలాంటి ఆటగాడికి దీర్ఘ కాలం అవకాశాలు ఇవ్వాలి. అతను వికెట్‌ కీపింగ్‌ కూడా బాగా చేస్తాడు. కాబట్టి అతణ్నే ఓపెనర్‌గా కొనసాగించాలి. రాహుల్‌ను ప్రత్యామ్నాయ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా ఉపయోగించుకోవాలి'' అని గంభీర్‌ అన్నాడు. శ్రీలంకతో టీమ్‌ఇండియా మూడు టీ20ల సిరీస్‌ మంగళవారం ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.