ETV Bharat / sports

'అవన్నీ పుకార్లే.. ధోనీ అంటే నాకు చాలా గౌరవం'

author img

By

Published : Mar 19, 2022, 1:01 PM IST

Gambhir comments on dhoni: ధోనీ అంటే తనకు చాలా గౌరవమని గౌతమ్ గంభీర్ అన్నాడు. ధోనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని స్ఫష్టం చేశాడు. అలాగే ధోని టీమ్​ఇండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

dhoni gambhir
ధోనీ గంభీర్

Gambhir comments on dhoni: ధోనీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ధోనీ అంటే తనకు ఇష్టముండదనే పుకార్లను కొట్టిపారేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన గంభీర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ.. మాజీ సారథి అంటే తనకెంతో గౌరవమని చెప్పాడు.

'అవన్నీ పుకార్లు మాత్రమే. ధోనీ అంటే నాకు అమితమైన గౌరవం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్లీ చెబుతున్నా. ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పగలను. అతడికి ఏ అవసరం వచ్చినా ముందుంటాను. ధోనీకి అలాంటి పరిస్థితి రాదు. కానీ, వస్తే అండగా ఉంటా. అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవలే అందుకు కారణం. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే.. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇంకో విషయం.. ధోనీ సారథ్యంలో నేనే ఎక్కువకాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడినప్పుడు మాత్రమే మైదానంలో ప్రత్యర్థుల్లా ఉన్నాం'

-గౌతమ్ గంభీర్, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్

అలాగే ధోనీ టీమ్‌ఇండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవని మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు నంబర్‌-3లో గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నా.. మహీ ఆ స్థానంలో ఆడితే ప్రతి రికార్డునూ తిరగరాసేవడని చెప్పాడు. కాగా, ధోనీ కెరీర్‌ ఆరంభంలో టీమ్‌ఇండియా తరఫున పలు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో ఆడాడు. అక్కడ అతడు 16 ఇన్నింగ్స్‌లు ఆడి 993 పరుగులు చేశాడు. ఇక 2005లో పాకిస్థాన్‌పై 148, శ్రీలంకపై 183 పరుగులు కూడా ఆ స్థానంలో ఆడినప్పుడు సాధించినవే కావడం విశేషం.

ఇదీ చదవండి: భారతీయ యువతితో మ్యాక్స్​వెల్ పెళ్లి.. శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.