ETV Bharat / sports

ఊరిస్తున్న టీమ్ఇండియా కెప్టెన్సీ.. ఐపీఎల్​లో రాణిస్తారా? - rishab pant ipl

Future Captains India: Future Captains India: కెప్టెన్​గా​ భారత క్రికెట్​పై విశేష ముద్ర వేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతడి తర్వాత విరాట్​ కోహ్లీ విజయవంతంగా సారథ్య బాధ్యతలు నెరవేర్చాడు. ఇప్పుడు రోహిత్​ శర్మ సైతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నడు. రోహిత్ తర్వాత టీమ్ఇండియా సారథి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఇందుకోసం పోటీ పడుతున్నారు. మరి ఐపీఎల్​లోనూ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వీరు.. ఈ సీజన్​లో ఎలా రాణిస్తారోనని క్రికెట్ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

IPL 2022
Future Captains India
author img

By

Published : Mar 21, 2022, 12:46 PM IST

IPL 2022: ప్రస్తుతం రోహిత్ శర్మ భారత్​కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్​ మరో మూడేళ్ల పాటు కెప్టెన్​గా కొనసాగే అవకాశం ఉంది. రోహిత్​ తర్వాత కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేయాలని పలువురు యువ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఐపీఎల్​లో కెప్టెన్లుగా రాణించి తమ సత్తా చాటాలనుకుంటున్నారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

ఐపీఎల్​ 2022పై దృష్టి పెట్టిన కేఎల్​ రాహుల్​

kl rahul
కేఎల్​ రాహుల్​

పంజాబ్​ కింగ్స్​ జట్టుకు రెండు సీజన్లలో నాయకత్వం వహించిన కేఎల్​ రాహుల్​ను.. కొత్త జట్టు లఖ్​నవూ కెప్టెన్​గా నియమించింది. కోహ్లీ గైర్హాజరుతో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్​గా విధులు నిర్వర్తించిన రాహుల్​ నిరాశపరిచాడు. అతడు నాయకత్వం వహించిన టెస్టులో ఇండియా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్​ను దక్షిణాఫ్రికా క్లీన్​స్వీప్​ చేసింది.

ఇక ఐపీఎల్​ రికార్డుల విషయానికి వస్తే కెప్టెన్​గా రాహుల్​.. 44 శాతం విజయాలను నమోదు చేశాడు. 27 మ్యాచులకు నాయకత్వం వహించగా.. 12 మ్యాచుల్లో టీమ్ విజయం సాధించింది. 15 మ్యాచ్​ల్లో ఓడిపోయింది. కెప్టెన్​గా రాహుల్​ రికార్డును పక్కనపెడితే బ్యాటింగ్​లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్​ 2020, 2021 సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు చేశాడు.

రాహుల్​కు గట్టిపోటీ ఇవ్వనున్న​ అయ్యర్​

sreyas iyer
శ్రేయస్​ అయ్యర్

కేఎల్​ రాహుల్​ తన ఫేవరెట్​ కెప్టెన్​ అని చెప్పాడు కోల్​కతా కొత్త కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​. కానీ, టీమ్ఇండియా కెప్టెన్సీ విషయంలో.. వీరిద్దరి మధ్య కొంత పోటీ తప్పక ఉంటుంది. ఐపీఎల్​ 2020లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్​ తొలి సారి ఆ జట్టును ఫైనల్స్​కు తీసుకెళ్లాడు. ఆ సీజన్​లో బ్యాటుతోనూ రాణించాడు. ప్రశాంతంగా ఉంటూ దిల్లీని నడిపించిన శ్రేయస్​ను చూసి.. భవిష్యత్ కెప్టెన్ అనుకున్నారు క్రికెట్ ప్రియులు. అయితే, గాయం కారణంగా కొంతకాలం క్రికెట్​కు దూరమయ్యాడు. ఆ తర్వాతి సీజన్​లో దిల్లీ కెప్టెన్​గా వ్యవహరించిన రిషభ్ పంత్​.. ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓ దశలో శ్రేయస్​కు.. టీమ్​ఇండియాలో చోటుపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ, ఇటీవల రీఎంట్రీ ఇచ్చి.. కీలక ఇన్నింగ్స్​లతో సత్తా చాటాడు. ఇప్పుడు ఐపీఎల్​లో కోల్​కతా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సీజన్​లో టీమ్​ను మెరుగ్గా నడిపించగలిగితే.. టీమ్ ఇండియా కెప్టెన్సీకి గట్టిపోటీదారుడు అవుతాడు శ్రేయస్.

కెప్టెన్సీపై కన్నేసిన రిషభ్​ పంత్​

Rishab pant
రిషభ్​ పంత్​

భారత తదుపరి కెప్టెన్ స్థానంపై కన్నేశాడు రిషభ్​ పంత్​. గతేడాది దిల్లీ క్యాపిటల్స్​కు నాయకత్వం వహించిన పంత్​.. జట్టును అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్​లోనూ అదరగొట్టాడు. టీమ్​ఇండియా తరఫునా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వయసు సైతం తక్కువగానే ఉండటం రిషభ్​కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం టీమ్ఇండియా వైస్​కెప్టెన్​ రేసులో ఉన్న రిషభ్​ను.. తదుపరి సారథిగా మేనేజ్​మెంట్ తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ​

వీరంతా.. ఐపీఎల్​లో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు సారథులుగా రాణిస్తే బాగుంటుంది. తమ కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించి, ఆకట్టుకుంటే రోహిత్ తర్వాత వీరిలో ఒకరు సారథ్య బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే అవుతుంది. ఈ ఏడాది​ ఐపీఎల్​ మార్చి 26న ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్‌లో హోరాహోరీగా సాగిన ముంబయి x చెన్నై మ్యాచ్‌లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.