ETV Bharat / sports

IND VS WI 2ND ODI : విండీస్ రెండో వన్డేలో ఆ ముగ్గురు మెయిన్.. రోహిత్​ సేనను ఊరిస్తున్న కీలక రికార్డులు

IND VS WI 2ND ODI Records : వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన దూసుకెళ్లింది. జట్టుకు స్కోర్​ అందించేందుకు అద్భత ప్రదర్శన చేసిన టీమ్​ఇండియా ప్లేయర్లు.. ఇదే వేదికగా ఎన్నో రికార్డులను తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే శనివారం జరగనున్న రెండో వన్డేలోనూ టీమ్ఇండియాకు చెందిన మరో ముగ్గురు ఆటగాళ్లు తమ ఆటతీరుతో పలు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. వారెవరంటే..

IND VS WI 2ND ODI
ఇండియా వర్సెస్​ వెస్టిండీస్ రెండో వన్డే
author img

By

Published : Jul 29, 2023, 2:49 PM IST

IND vs WI ODI Records : విండీస్​ పర్యటనలో టీమ్​ఇండియా ప్లేయర్లు దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్​లో రాణించిన రోహిత్​ సేన.. తొలి వన్డేలోనూ సత్తా చాటారు. తమ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్​ ప్లేయర్లను చిత్తు చేసి ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. అయితే ఈ వేదికగా తొలి వన్డేలో కొంత మంది ప్లేయర్లు తమ ఖాతాల్లో పలు రికార్డులను వేసుకోగా.. రెండో వన్డేలోనూ టీమ్ఇండియాకు చెందిన మరో ముగ్గురు ఆటగాళ్లు తమ ఆటతీరుతో పలు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. వారెవరంటే..

ఆ పొజిషన్ కోసం జడ్డూ..
Ravindra Jadeja ODI Record : తన బౌలింగ్​ స్కిల్స్​తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు టీమ్​ఇండియా ప్లేయర్​ రవీంద్ర జడేజా. స్వతహాగా ఆల్​రౌండర్​ అయిన జడ్డూ.. విండీస్ పర్యటనలో తన బౌలింగ్​ స్కిల్స్​తో పాటు బ్యాటింగ్​లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన 30 వన్డేల్లో మొత్తం 44 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్​ ప్లేయర్​.. ఇటీవలే జరిగిన భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. తన కో ప్లేయర్​ ముకేశ్​ కుమార్​తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును నెలకొల్పాడు. అయితే తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన 38 మ్యాచుల్లో 44 వికెట్లు తీసి వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోర్ట్నీ వాల్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో జడేజా కనీసం ఒక్క వికెట్ అయినా సాధించగలిగితే.. భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నయా రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.

ఒక్క సెంచరీ కావాలి గురు..
Virat Kohli ODI Records : క్రికెట్​ లవర్స్​ మదిలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదికున్న రన్స్​ మెషిన్​ విరాట్​ కోహ్లీ కూడా రెండో వన్డే​లో ఓ రికార్డును నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. రెండో వన్డే​లో క్రీజులోకి దిగి సెంచరీ దాటితే.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకోనున్నాడు.

ప్రస్తుతం వన్డేల్లో అతను చేసిన స్కోర్​ 12,898 పరుగులు. ఈ మ్యాచ్‌లో 102 స్కోర్​ చేస్తే.. వన్డేల్లో 13,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు తీసిన రెండో భారత, ఓవరాల్​లో ఐదవ బ్యాట్స్‌మన్​గా అవ్వనున్నాడు. అంతే కాకుండా అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా రికార్డులకెక్కుతాడు.

ఆ జోడీ కూడా..
Rohit Virat ODI Runs : మరోవైపు విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 85 సార్లు కలిసి బ్యాటింగ్ చేశారు. ఇందులో ఈ జోడీ ఏకంగా 4998 పరుగులు చేసి రికార్డుకెక్కింది. అయితే రానున్న రెండో వన్డేలో వీరిద్దరూ కలిసి 2 పరుగులు చేస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో బ్యాటింగ్ జోడీగా చరిత్రకెక్కనుంది. మరోవైవు వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలవనున్నాడు. సచిన్ తెందూల్కర్​, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్​, ఎంఎస్ ధోనీ వంటి ప్లేయర్స్​ సరసన ఎలైట్ లిస్ట్‌లో చేరడానికి రోహిత్‌కు ఇంకా 163 పరుగులు అవసరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.