గత 10- 12 ఏళ్లలో భారత క్రికెట్ జట్టు చాలా ముందుకెళ్లిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్(Inzamam-ul-Haq) అభిప్రాయపడ్డాడు. దేశంలోని వివిధ స్థాయిల్లో క్రికెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు.
"2010 వరకు భారత్, పాక్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగేవి. కానీ గత 10- 12 ఏళ్లలో భారత్ తన ఆటతీరును ఎంతో మెరుగుపరుచుకుంది. పాక్, శ్రీలంక జట్లను దాటి చాలా ముందుకెళ్లింది. ఈ ఘనత కచ్చితంగా ఐపీఎల్‌దే. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కూడా భారత క్రికెట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. బీసీసీఐ దగ్గర చాలా నిధులున్నాయి. ఆటగాళ్లకు శిక్షణ పరంగా అత్యుత్తమ వసతులు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టమైన దేశవాళీ వ్యవస్థతో టీమ్‌ఇండియా ప్రయోజనాల్ని పొందుతోంది. పాక్, శ్రీలంక మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను అంతగా అభివృద్ధి చేయలేకపోయాయి."
- ఇంజమాముల్ హక్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియా లాంటి ఆగ్రశ్రేణి జట్టును ఓడించేందుకు గతంలో చాలా కష్టపడేవారని.. కానీ, ఆసీస్ సొంతగడ్డపై ఆ జట్టుపై ఓడించిందని ఇంజమామ్ అన్నాడు. ఆ విషయంలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు వెనుకపడి ఉన్నాయని తెలిపాడు. "ఒకప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఉన్న జట్లు ఆస్ట్రేలియాలో ఆడేందుకు చాలా కష్టపడేవి. కంగారూ గడ్డపై ఆసీస్‌ను ఓడించడం దాదాపుగా అసాధ్యం. అయితే టీమ్ఇండియా యువ బృందం ఆసీస్‌ను సొంతగడ్డ(IND vs AUS)పై మట్టికరిపించడం ద్వారా నమ్మశక్యం కాని పనిచేశారు(Boardar Gavaskar Trophy). అందుకే దేశవాళీ క్రికెట్ వ్యవస్థ అత్యుత్తమంగా ఉండాలి. అప్పుడే ఆటగాళ్లు అన్నింటింకీ సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో పాక్, శ్రీలంక జట్లు కాస్త వెనుకపడ్డాయి" అని ఇంజమామ్ అన్నాడు.
ఇదీ చూడండి: కివీస్ జట్టును వాళ్లు ఇబ్బంది పెట్టడం ఖాయం!