ETV Bharat / sports

'ఈసారి వరల్డ్​కప్​ మనదే.. ఈ కుర్రాళ్లకు సత్తా ఉంది'

టీమ్ఇండియా ప్లేయర్లపై మాజీ దిగ్గజం సౌరభ్​ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారత జట్టు వరల్డ్​కప్​ సాధిస్తుందని.. ఆ సత్తా ఆటగాళ్లకు ఉందని అన్నారు. అలాగే రోహిత్​ శర్మ, రాహుల్​ ద్రావిడ్​, సెలక్టర్లకు పలు సూచనలు చేశాడు.

odi world cup 2023 team india sourav ganguly

author img

By

Published : Jan 29, 2023, 3:59 PM IST

టీమ్ఇండియా ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్​ కప్​ గెలుస్తుందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరభ్​ గంగూలీ అన్నాడు. ప్రపంచకప్​ టైటిల్​ గెలిచే సత్తా టీమ్​ఇండియాకు ఉందని కితాబిచ్చారు. శ్రీలంక, న్యూజిలాండ్​పై రాణించిన జట్టునే కొనసాగించాలని.. ఆ మేరకు కెప్టెన్ రోహిత్​ శర్మ, కోచ్​ రాహుల్​ ద్రావిడ్​ ఆలోచించాలని గంగులీ సూచించాడు. కాగా, చివరిగా 2011లో టీమ్ఇండియా వరల్డ్​కప్​​ ​ గెలిచింది. ఆ తర్వాత 2013 నుంచి ఇప్పటివరకు ఒక ఐసీసీ టోర్నమెంట్​ కూడా గెలవలేదు.

"టీమ్​ఇండియా ఎప్పటికీ బలహీనమైన జట్టు కాలేదు. ఈ దేశంలో చాలా టాలెంట్​ ఉంది. ఇంత ప్రతిభతో ఉన్న దేశం ఎప్పటికీ బలహీనమైన జట్టు కాలేదు. ఇప్పటివరకు సగం మందికి ఆడే ఛాన్స్ రాలేదు​. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ,సెలెక్టర్లకు నేనిచ్చే సలహా ఒకటే. వరల్డ్ కప్ వరకూ ఇదే జట్టును కొనసాగించండి. వరల్డ్​ ఆడేటప్పుడు ప్లేయర్లు.. భారం లేకుండా, నిర్భయంగా క్రికెట్​ ఆడాలి. గెలిచామా లేదా అన్నది తర్వాత విషయం'

-- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు

ఈ కుర్రాళ్లకు సత్తా ఉంది...
టీమ్​ఇండియా ఆటగాళ్లను గుంగులీ పొగడ్తలతో ముంచెత్తాడు. ప్లేయర్లకు సత్తా ఉందని.. రాబోయే వరల్డ్​ కప్​లో తమ బెస్ట్​ ప్రదర్శన చేయాలని వారిని కోరాడు. కాగా, ఇటీవల జరిగిన మ్యాచ్​ల్లో సుభ్​మన్​ గిల్, ఇషన్​ కిషన్​ డబుల్​ సెంచరీలతో మెరిశారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్​లో ఇషన్​ తన ఫామ్​ను కొనసాగించాడు. బుమ్రా స్థానంలో మహ్మద్​ సిరాజ్​ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం టీమ్​ఇండియాలో రవీంద్ర జడేజా, బుమ్రా లేరు. ఇక, ఇటీవల గాయం నుంచి కోలుకున్న జడేజా.. సౌరాష్ట్ర టీమ్​ తరఫున రంజీ ఆడనున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఆడేముందు ఇది ఒక పిక్​అప్​లా ఉపయోగపడుతుంది. ఇక స్టార్​ బౌలర్​ బుమ్రా కూడా రికవరీ అవుతున్నాడని సమాచారం. ఇతడు బోర్టర్​ గవస్కర్​ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశముంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.