ETV Bharat / sports

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ కన్నుమూత

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్ శర్మ గుండెపోటుతో మృతిచెందారు. 1983 ప్రపంచకప్​ గెలిచిన బృందంలో ఆయన సభ్యుడు. 1979-83 వరకు మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా భారత జట్టులో కీలక పాత్ర పోషించారు.

yashpal sharma, former indian cricketer
యశ్​పాల్ శర్మ, భారత మాజీ క్రికెటర్
author img

By

Published : Jul 13, 2021, 11:28 AM IST

Updated : Jul 13, 2021, 2:22 PM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. 1983 ప్రపంచకప్​ గెలిచిన భారత జట్టులో యశ్​పాల్​ సభ్యుడు. ఈ మెగాటోర్నీలో కపిల్​సేన విశ్వ విజేతగా నిలవడంలో యశ్​పాల్​ కీలక పాత్ర పోషించారు.

కెరీర్​లో 37 వన్డేలతో పాటు 42 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించారు యశ్​పాల్​. 1979-83 కాలంలో భారత జట్టు మిడిలార్డర్​లో కీలక బ్యాట్స్​మన్​గా సేవలందించారు. రిటైర్మెంట్ ప్రకటించిన​ తర్వాత కొద్దికాలం జాతీయ సెలెక్టర్​గా పనిచేశారు. రంజీల్లో పంజాబ్​, హరియాణాతో పాటు రైల్వేస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవాళీల్లో 160 మ్యాచ్​లు ఆడిన ఈ మాజీ క్రికెటర్​.. 8,933 పరుగులు సాధించారు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 201*.

యశ్​పాల్ మృతిపై సహచర క్రికెటర్​ మదన్​లాల్​ స్పందించారు. "యశ్​పాల్ లేడనే విషయం నమ్మలేకపోతున్నా. అతడితో కలిసి ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి. పంజాబ్​ జట్టుతో మొదలైన మా ప్రయాణం.. ప్రపంచకప్​లోనూ కొనసాగింది. అతడు చనిపోయారనే విషయం కపిల్ చెప్పాడు. అందరం ఒక్క సారిగా షాకయ్యాం. అతని క్రికెట్​ జీవితం అద్భుతం. ఇటీవల ఓ బుక్​ లాంచ్ సందర్భంగా కలిశాం. ఇది నేను నమ్మలేకపోతున్నా. అతడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలున్నారు" అని భావోద్వేగం చెందారు.

ప్రధాని సంతాపం..

యశ్​పాల్​ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. "1983 ప్రపంచకప్​లో పాల్గొన్న​ అతి ముఖ్యమైన క్రికెటర్లలో యశ్​పాల్ ఒకరు​. వర్ధమాన క్రికెటర్లకు ఆయన ప్రేరణగా నిలిచారు. ఆయన మరణం నన్నెంతో కలిచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని పీఎం పేర్కొన్నారు.

  • Shri Yashpal Sharma Ji was a much beloved member of the Indian cricket team, including the legendary 1983 squad. He was an inspiration for teammates, fans as well as budding cricketers. Anguished by his passing away. Condolences to his family and admirers. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • यशपाल शर्मा जी क्रिकेट के एक उम्दा खिलाडी थे जिन्होंने 1983 क्रिकेट विश्व कप में भारत की ऐतिहासिक जीत में अहम योगदान दिया। उनकी रोमांचक पारियां हमेशा हमारी स्मृति में रहेंगी। उनका निधन क्रिकेट जगत के लिए एक बड़ी क्षति है। उनके परिजनों व समर्थकों के प्रति मेरी संवेदनाएं। ॐ शांति

    — Amit Shah (@AmitShah) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: క్రికెట్ 'మక్కా'లో టీమ్ఇండియా 'దాదా'గిరి!

Last Updated : Jul 13, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.