Suresh Raina: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్.. మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేసిన అనుభవమూ ఆయనకు ఉంది.
త్రిలోక్‌చంద్ పూర్వీకులది జమ్ముకశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10వేల జీతంతో.. సురేశ్ రైనా క్రికెట్ కోచింగ్ ఫీజులను కట్టలేకపోయేవారు.
1998లో లఖ్‌నవూలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కళాశాలలో చేరాడు సురేశ్ రైనా. కశ్మీర్ ఉదంతం గురించి తన తండ్రికి జ్ఞాపకం తెచ్చే ఏ అంశాన్ని మాట్లాడకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడేవాడినని రైనా గతంలో చెప్పాడు.
2020 ఆగస్టులో ధోనీతో పాటే రిటైర్మెంట్ ప్రకటించాడు రైనా. భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ సూపర్‌జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు.
ఇదీ చూడండి: ధోనీ ఆడకపోతే.. నేనూ ఆడను: రైనా