ETV Bharat / sports

తల్లి కాబోతున్న లెస్బియన్ క్రికెటర్ - మహిళా క్రికెటర్ సారా టేలర్ ప్రెగ్నెంట్​

ఇంగ్లాండ్​ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ తన అభిమానులకు తీపికబురు చెప్పింది. స్వలింగ సంపర్కురాలైన ఈ స్టార్ బ్యాటర్.. తన భాగస్వామి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Former England Star Sarah Taylor Announces
తల్లి కాబోతున్న మహిళా క్రికెటర్​ భాగస్వామి
author img

By

Published : Feb 22, 2023, 9:09 PM IST

ఇంగ్లాండ్​ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కురాలైన ఈ ఇంగ్లాండ్​ స్టార్ బ్యాటర్.. తన పార్ట్నర్​ గర్భం దాల్చిందంటూ ట్వీట్ చేసి హర్షం వ్యక్తం చేసింది. డయానా అనే మహిళతో రిలేషన్​షిప్​లో ఉన్న సారా.. అమ్మ కావాలనేది తన భాగస్వామి కోరికని పేర్కొంది.

"అమ్మకావాలనేది నా పార్ట్నర్​ డ్రీమ్​. ఆ ప్రయాణం అంత సులువు కాదు. అయితే డయానా ఈ విషయంలో పట్టువదల్లేదు. ఆమె బెస్ట్ మదర్ అవుతుందని నాకు తెలుసు. నేను ఈ ఫ్యామిలీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మరో 19 వారాల్లో మా జీవితం పూర్తిగా మారిపోనుంది." అని సారా టేలర్ రాసుకొచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు సారా టేలర్‌కు తెలుపుతున్నారు.

వరల్డ్​లోని టాప్​ వికెట్​ కీపర్​ బ్యాటర్లలో సారా టేలర్‌ ఒకరు. 2006లో భారత్​పై జరిగిన మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టిన ఆమె.. 2019లో ఆటకు వీడ్కోలు పలికింది. 2016లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్​ కారణంగా ఆట నుంచి విరామం తీసుకున్న సారా.. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్‌ వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

మొత్తంగా ఇంగ్లాండ్‌ తరఫున 10 టెస్టులు(300 పరుగులు), 126 వన్డేల్లో(4056 రన్స్​, 7 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలు), 90 టీ20లు ఆడింది. ఏడు సెంచరీలు చేసిన సారా 20 హాఫ్ సెంచరీలు బాదింది. 90 టీ20 ఇన్నింగ్స్‌ల్లో(2177, 16 అర్ధ శతకాలు) ఆడింది. వికెట్​ కీపర్​గా 138 క్యాచులు అందుకుంది. 104 స్టంపౌట్లు చేసింది. మూడుసార్లు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సెలెక్ట్ అయింది. అలా తన కెరీర్​లో 2009, 2017 వన్డే వరల్డ్ కప్‌‌తోపాటు 2009 టీ20 ప్రపంచ కప్​ ఇంగ్లాండ్ జట్టులో ఆమె సభ్యురాలుగా ఉంది.

రిటైర్మెంట్​ తర్వాత కోచ్‌గా తన సెకండ్​ ఇన్నింగ్స్​ను​ ప్రారంభించింది సారా. మెన్స్​ టీమ్​కు కోచ్‌గా పనిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ రికార్డుకెక్కింది. అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసింది. అంతకుముందు ఇంగ్లాండ్​ పురుషుల కౌంటీ టీమ్‌ సుసెక్స్‌ టీమ్​కు స్పెషలిస్ట్ కోచ్‌గానూ వ్యవహరించింది. ఇకపోతే ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి టేలర్ కుటుంబంతోనే గడుపుతోంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే టేలర్​.. డయానా ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకుంది.

ఇదీ చూడండి: WPL 2023: దీప్తి శర్మకు షాక్​.. యూపీ వారియర్స్​ కెప్టెన్​గా ఆసీస్​ బ్యాటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.