ETV Bharat / sports

పాక్​ టీ20 జట్టు​ సెలెక్షన్​పై మిస్బా అసహనం - పాక్​ మాజీ సారథి మిస్బా

టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో పాకిస్థాన్​ టీమ్ సెలెక్షన్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ జట్టు మాజీ కోచ్ మిస్బా ఉల్​ హక్. జట్టును ఎంపిక చేసిన పది రోజులకే ముగ్గురు ఆటగాళ్లను మార్చడం వల్ల సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

misbah ul haq
మిస్బా ఉల్ హక్
author img

By

Published : Oct 21, 2021, 5:32 AM IST

పక్కవారిపై నిందలేసే స్వభావాన్ని మానుకోనంత వరకూ పాకిస్థాన్​ క్రికెట్​లో ఎలాంటి అభివృద్ధి ఉండదని ఆ దేశ జట్టు మాజీ సారథి మిస్బా ఉల్ హక్ వ్యాఖ్యానించాడు. గత నెల హెడ్​ కోచ్​ పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన అతడు మొదటిసారిగా మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో పాకిస్థాన్​ టీ20 స్క్వాడ్​ సెలెక్షన్​పై విమర్శలు గుప్పించాడు.

"మా దగ్గర ఉన్న అసలు సమస్య ఏంటంటే.. మేం ఫలితాన్ని మాత్రమే చూస్తాం. ఓపికతో, ప్రణాళికలు రచించి సిస్టమ్​ను అభివృద్ధి చేసేందుకు సమయం ఇవ్వం. దేశవాళీ ఆటగాళ్లను తీర్చిదిద్దాలనే విషయంపై ఎలాంటి శ్రద్ధ వహించం. ఫలితం ఆశిస్తాం. అనుకున్న ఫలితం రాకపోతే పక్క వారిపై నిందలు మోపే వారికోసం చూస్తాం."

-మిస్బా ఉల్ హక్, మాజీ సారథి.

మిస్బా, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్​ తమ పదవుల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో దాదాపు నెల రోజుల తర్వాత మాట్లాడిన మిస్బా.. సెలక్షన్​ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్ టీ20 స్వ్కాడ్​లో మార్పులు చేసినందుకు ఆగ్రహించారు. ప్రపంచకప్​ కోసం 15 మందిని ఎంపిక చేసి పది రోజులు కూడా గడవకుండా ముగ్గురు ఆటగాళ్లను మార్పు చేయడం సరికాదని అన్నారు.

ఇదీ చదవండి:

T20 World Cup: పాక్‌తో అంత ఆషామాషీ కాదు

భారత్​-పాక్​ మ్యాచ్.. సోషల్ మీడియాకు సానియా దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.