ETV Bharat / sports

ఐపీఎల్​లోకి గంగూలీ రీఎంట్రీ.. ఆ జట్టు తరఫున కీలక బాధ్యతలు

author img

By

Published : Jan 3, 2023, 3:35 PM IST

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ గంగూలీ ఐపీఎల్​లో తిరిగి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. దీల్లీ క్యాపిటల్స్​ తరఫున కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఆ వివరాలు..

IPL ganguly new season
ఐపీఎల్​ కొత్త సీజన్​లో గంగూలీ

ఐపీఎల్ కొత్త సీజన్​కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంచైజీలు తన జట్టులో మార్పులు చేస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇందులో భాగంగానే దిల్లీ క్యాపిటల్స్​ తమ జట్టులో కీలక మార్పు చేసినట్లు తెలిసింది. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవికి గుడ్​బై చెప్పిన స్టార్ క్రికెటర్​ గంగూలీకి మళ్లీ తమ జట్టులో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. డైరెక్టర్​ ఆఫ్ క్రికెటర్​ బాధ్యతలను అప్పగించబోతున్నట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తైనట్లు పేర్కొన్నాయి. దీంతో పాటే అతడు ఐఎల్ టీ20 జట్టు దుబాయ్​ క్యాపిటల్స్​, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్​లో ప్రీటోరియా క్యాపిటల్స్​ టీమ్​ బాధ్యతలను కూడా స్వీకరించబోతున్నట్లు వెల్లడించారు. "అవును దాదా ఈ ఏడాది మళ్లీ దిల్లీ క్యాపిటల్స్​తో కలిసి పనిచేయనున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు, ఫార్మాలిటీస్​ పూర్తయ్యాయి. అతడు ఫ్రాంచైజీతో కలిసి ఇప్పటికే పనిచేశాడు, యాజమాన్యంతో కూడా మంచి అనుబంధం ఉంది" అని తెలిపాయి. కాగా, గతంలో 2019లో దిల్లీ క్యాపిటల్స్​కు దాదా మెంటార్​గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవలే జరిగిన మినీ వేలంలో దిల్లీ క్యాపిటల్స్.. రిలీ రూసో(రూ.4.6 కోట్లు), మనీశ్ పాండే(రూ.2.4 కోట్లు), ముఖేష్ కుమార్(రూ.5.5 కోట్లు), ఇషాంత్ శర్మ(రూ.50 లక్షలు), ఫిల్ సాల్ట్(రూ.2 కోట్లు)ను కొనుగోలు చేసింది. దీంతో ఇంకా దిల్లీ వద్ద ఇంకా రూ.4.45 కోట్లు మిగిలి ఉంది.

ఇదీ చూడండి: 'ప్రయోగాలకు సమయం లేదు!'.. శ్రీలంక సిరీస్​పై కొత్త కెప్టెన్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.