ETV Bharat / sports

వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ టెస్టుపై క్లారిటీ - ECB news latest

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ రవిశాస్త్రి సహా పలువురికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినందున భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు(IND vs ENG 5th Test) వాయిదా పడింది. తాజాగా ఈ చివరి టెస్టు నిర్వహణపై స్పష్టత ఇచ్చింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(England Cricket Board News). ఈ మ్యాచ్​ వేదికను కూడా మార్చినట్లు తెలిపింది.

Ind vs Eng
టీమ్​ఇండియా X ఇంగ్లాండ్
author img

By

Published : Oct 22, 2021, 7:52 PM IST

కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టుపై(IND vs ENG 5th Test) క్లారిటీ వచ్చేసింది. ఈ టెస్టు మ్యాచ్​ను వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB News) తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం టీమ్​ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్​ జరగనున్నట్లు తెలిపింది.

"భారత్​-ఇంగ్లాండ్​ మధ్య ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1తో టీమ్​ఇండియా ఆధిక్యంలో ఉంది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సిరీస్​ చివరి టెస్టు మ్యాచ్ వచ్చే ఏడాది జులై 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఎడ్జ్​బాస్టన్​ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మధ్య అంగీకారం కుదిరింది" అని ఈసీబీ స్పష్టం చేసింది.

మాంచెస్టర్(Manchester Test) వేదికగా ఈ మ్యాచ్​ జరగాల్సి ఉంది. కానీ, ఈసీబీ ప్రస్తుతం వేదికను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్​ కోసం అప్పటికే టికెట్లు కొన్నవారికోసం తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు ఈసీబీ తెలిపింది. మ్యాచ్​ను వీక్షించేందుకు వీలుకాని అభిమానులకు టికెట్​ డబ్బులు తిరిగి ఇచ్చే ఏర్పాట్లు కూడా ఎడ్జ్​బాస్టన్​ మైదానం యాజమాన్యం చూసుకుంటుందని పేర్కొంది.

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయ సిబ్బందిలో కొంత మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన కారణంగా ఈ సిరీస్​ ఐదో టెస్టు మ్యాచ్ వాయిదా పడింది.

ఇదీ చదవండి:

IND Vs ENG: ఐదో​ టెస్టు రద్దు దురదృష్టం: కోహ్లీ

IND Vs ENG: రద్దయిన టెస్టు నిర్వహణపై క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.