మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన భారత ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌కు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 30 ఏళ్ల నటరాజన్ ఐపీఎల్-14లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు. అతడి మోకాలికి ఆస్ట్రేలియా పర్యటనలోనే గాయమైంది.
ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసానికి వెళ్లిన అతడు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడాడు. ఐపీఎల్ సందర్భంగా గాయం తీవ్రత ఎక్కువ కావడం వల్ల అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.