ETV Bharat / sports

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం - వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ

Fans Reaction on Kohli ODI Captaincy: విరాట్​ కోహ్లీని వన్డే జట్టుకు సారథిగా తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. రోహిత్ శర్మను కెప్టెన్​గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో బీసీసీఐ, గంగూలీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులు.

kohli
కోహ్లీ
author img

By

Published : Dec 9, 2021, 3:50 PM IST

Fans Reaction on Kohli ODI Captaincy: దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమ్​ఇండియా వన్డే జట్టుకు సారథిగా రోహిత్​ శర్మను నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. విరాట్​ కోహ్లీని తొలగిస్తూ ఊహించని విధంగా బీసీసీఐ ఈ ప్రకటన చేయడంపై ట్విట్టర్​లో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై కూడా మండిపడుతున్నారు.

"రోహిత్​ శర్మను టీ20లతో పాటు వన్డే జట్టుకు కూడా సారథిగా నియమించాలని ఆల్​ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది." అని బీసీసీఐ బుధవారం​ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే.. విరాట్​ కోహ్లీ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు కమిటీకి చెప్పాడా? లేదా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫ్యాన్స్ ట్వీట్లు..

'విరాట్ కోహ్లీని ఎందుకు తొలగించారు? 95 వన్డేల్లో 65 విజయాలు సాధించాడు. ఇది సరిపోదా? ప్రపంచకప్​లో ఓడిపోవడమే కారణమా? ధోనీ, గంగూలీ ప్రపంచకప్​ ఓడిపోయిన సందర్భాలు లేవా? ఇది భారత క్రికెట్​కు మంచిదికాదు.' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

  • Why #ViratKohli is sacked?
    65/95 wins, is this not good?
    Just world cup is the criteria?
    Dhoni and Ganguly not lost in WCs?
    Would this do any good to Indian dressing room?
    Should politics interface with sports? Heart says it won't do any good to Indian cricket #RohitSharma 🙅 https://t.co/UfJ1XViBvJ

    — Pupil Of Pol-Sci (@adityapareek10) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఈ నిర్ణయం.. ఒకరకంగా విరాట్​ కోహ్లీని అవమానించడమే. బీసీసీఐకి థాంక్యూ అని చెప్పాలని అనిపించట్లేదు. షేమ్ ఆన్ యూ బీసీసీఐ, జై షా, గంగూలీ.' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.

  • This is utter disrespect to the GOAT ODI player of this game. No thanku tweet. Nothing. SHAME ON U BCCI. SHAME ON U JAY SHAH. SHAME ON U GANGULY.
    Pls fear karma https://t.co/FBgsu6EiQl

    — @v (@firebal_india) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The last time a captain was sacked in Indian cricket, Dravid took over from Ganguly.

    Now, apparently Kohli is sacked and Dravid is the head coach with Ganguly as President. 🤷🏻‍♀️

    — Sarah Waris (@swaris16) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Virat in T20I Captaincy Tweet mentioned that he had talks with BCCI members,Selectors&Rohit about leaving T20I Captaincy

    If selectors/Ganguly wanted to remove him from ODI Captaincy too ,why didn't they discuss about ODI Captaincy at that time itself when he left T20I Captaincy

    — Virarsh (@Cheeku218) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • brudda literally said he dropped t20 captaincy to focus on leading the team to that home WC in 2023 loll. When Ganguly went through this everyone was furious, but now many are celebrating it. For a player with 10x the ability. Biggest irony is Ganguly made this call lmaoooo https://t.co/LU2bIlXzhB

    — devesh (@devesh0303) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీ20 ప్రపంచకప్​నకు ముందు సారథిగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్​ ద్వారా అభిమానులకు తెలిపాడు. 2023 ప్రపంచకప్​ దృష్ట్యా వన్డే, టెస్టు జట్లకు మాత్రం సారథిగానే కొనసాగుతానని పేర్కొన్నాడు. అయినప్పటికీ.. బీసీసీఐ తాజా నిర్ణయంతో అభిమానులకు అసంతృప్తి మిగిలింది.

ఇదీ చదవండి:

rohit captaincy: రోహిత్​కు వన్డే పగ్గాలు.. మాజీలు ఏమన్నారంటే?

kohli odi captaincy: విరాట్ ఇప్పుడు ఏం చేస్తాడు?

ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీనే.. కోహ్లీ మెడపై మరో కత్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.