ETV Bharat / sports

'నా వరకైతే ధోనీ లెజెండ్.. కోహ్లీ ఒక ప్రేరణ' - ఎంఎస్ ధోనీ ఒక లెజెండ్

టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్ యాదవ్ ఇన్​స్టాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ధోనీ, కోహ్లీ గురించి ఒక్క ముక్కలో బదులివ్వాలని కోరగా.. ఆసక్తికరంగా స్పందించాడు.

Suryakumar Yadav, team india batsman
సూర్య కుమార్ యాదవ్, టీమ్​ఇండియా బ్యాట్స్​మన్
author img

By

Published : May 23, 2021, 5:36 AM IST

టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ సూర్యకుమార్ యాదవ్​ సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చాడు. తన ఇన్​స్టా ఖాతాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సరదాగా స్పందించాడు.

ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీతో పాటు ప్రస్తుత సారథి కోహ్లీ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మహి అంటే 'లెజెండ్'​ అని.. కోహ్లీ తన 'ప్రేరణ' అని తెలిపాడు. ఇక ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి అడగగా.. 'హిట్​మ్యాన్'​ అంటూ బదులిచ్చాడు.

తన అత్యుత్తమ ఇన్నింగ్స్​ ఏది అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. ఇటీవల ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో సిక్సర్​తో హాఫ్​ సెంచరీ చేసిన ఫొటోను పోస్టు చేశాడు సూర్య.

ఇదీ చదవండి: బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా బాయ్ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.