ETV Bharat / sports

'నిన్ను జట్టు నుంచి తప్పించిందెవరు?'- వార్నర్ ఫన్నీ రిప్లై

2021 ఐపీఎల్​లో తనను తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసీస్​ క్రికెటర్​ డేవిడ్ వార్నర్ స్పందించాడు. కారణమైన వ్యక్తి పేరు చెప్పకుండా ఫన్నీ ఎమోజీలతో బదులిచ్చాడు.

author img

By

Published : Jun 30, 2021, 9:16 PM IST

david warner
డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్​ డేవిడ్ వార్నర్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్ ఫ్రాంఛైజీ​కి విడదీయరాని అనుబంధం ఉంది. అంతటి ఆటగాడికి 2021 ఐపీఎల్​ సీజన్​లో​ ఛేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా జట్టుకు దూరమయ్యాడు. అసలు దీని వెనుక ఎవరున్నారనే విషయంపై తాజాగా స్పందించాడు వార్నర్.

వార్నర్​ సారథిగా 2016లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్​ టైటిల్ అందించాడు వార్నర్. గత మూడు సీజన్ల నుంచి సన్​రైజర్స్​​ బ్యాటింగ్​ విభాగానికి డేవిడ్​​ వెన్నెముకలా ఉన్నాడు. టీమ్​ నుంచి తప్పించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. నవ్వుతున్న ఎమోజీలను బదులుగా పెట్టాడు వార్నర్. పేరు మాత్రం వెల్లడించలేదు.

Fan asks 'whose idea was it to drop you from SRH', David Warner responds
వార్నర్​ సమాధానం

నిలకడలేమి..

ఐపీఎల్​ తొలి అర్ధ భాగంలో సన్​రైజర్స్ జట్టు నిలకడలేమితో సతమతమైంది. విజయాలకు చేరువగా వచ్చి ఓటమి పాలైంది. 2016 నుంచి​ 2020 వరకు ప్రతి సీజన్​లో ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించిన ఈ జట్టు.. 2021 సీజన్​లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

కొవిడ్ కారణంగా ఐపీఎల్​ 14వ సీజన్ మే 4న నిరవధిక వాయిదా పడింది. దేశంలో ఇంకా కరోనా విజృంభణ తగ్గకపోవడం వల్ల రెండో దశ ఐపీఎల్​ను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్​ 19 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.​

ఇదీ చదవండి: ప్రతి ఫార్మాట్లో 100+ మ్యాచ్​లు.. కివీస్ క్రికెటర్​ రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.