ETV Bharat / sports

T20 world cup: అన్ని జట్లకూ ఒకే సమస్య.. అసలు వారికి ఏమైంది? - ఇంగ్లాండ్​ టీమ్​ ఓపెనర్స్​

హోరా హోరీగా సాగుతున్న టీ 20 ప్రపంచ కప్​ టీమ్​లను ఓ ప్రధాన సమస్య వేధిస్తోంది. సెమీస్​లో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న ఆ జట్లకున్న సమస్య ఏంటంటే?

failures of openers in t20 world cup 2022

author img

By

Published : Nov 1, 2022, 7:22 PM IST

టీ20 ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవడానికి జట్లన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మెగా టోర్నీని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న జట్లను ఇప్పుడు ఓ ప్రధాన సమస్య వేధిస్తోంది. అదే ఓపెనింగ్‌ భాగస్వామ్యం. టీమ్​ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు దాదాపు అన్ని జట్లను ఓపెనింగ్ జోడిల వైఫల్యం వేధిస్తోంది. కీలకమైన పవర్‌ ప్లేలో భారీగా పరుగులు సాధిస్తారని ఆశలు పెట్టుకున్న బ్యాటర్‌లు తక్కువ పరుగులకే వెనుదిరగడం ఆయా జట్లలో ఆందోళనను పెంచుతోంది.

అంతా బాబర్​ మయమే..
14....4....0... ఇవీ పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ టీ 20 ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో నమోదు చేసిన స్కోర్లు. పాక్‌ జట్టు అతిగా ఆధారపడే బాబర్‌ ఆజమ్ వరుస వైఫల్యాలతో ఆ జట్టు ఈ మెగా టోర్నీ నుంచి. దాదాపు నిష్క్రమించింది. పాక్‌ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా సెమీస్‌ చేరే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. దీనికి బాబర్ ఆజమ్‌ వైఫల్యాలు ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. బ్యాటింగ్‌ వైఫల్యంతో జింబాబ్వే విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పాక్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగిన ఆజమ్‌ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు

కలవరపెడుతున్న రాహుల్​ వైఫల్యాలు..
ఈ మెగా టోర్నీలో టీమ్​ఇండియా ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ 9,9,4 పరుగులు చేశాడు. కీలకమైన టోర్నీలో రాహుల్‌ వైఫల్యం. టీమ్​ఇండియాకు శరాఘాతంగా మారుతోంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పర్వాలేదు అనిపించిన రాహుల్‌... పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. ఈ సమయంలో రాహుల్‌ స్థానంలో.. పంత్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి. సెమీస్‌ చేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌లు కీలకమైన దశలో రాహుల్‌ ఇప్పటికైనా ఫామ్‌ అందుకుని పరుగుల వరద పారించాలని టీమ్​ఇండియా కోరుకుంటోంది.

ముందుండాల్సిన వారే వెనకడుగు...
డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓపెనర్ల భాగస్వామ్యం కలవరపెడుతోంది. ఆసిస్‌కు భారీ భాగస్వామ్యాలు అందించే డేవిడ్‌ వార్నర్‌ గత మూడు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా రాణించలేదు. 3, 11, 5 పరుగులతో వార్నర్‌ వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగులకే వెనుదిరిగిన డేవిడ్‌ భాయ్‌ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 3 పరుగులకే వెనుదిరిగాడు. సెమీస్‌ నాటికి వార్నర్‌ ఫామ్ అందుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరుకుంటోంది. ఇటు దక్షిణాఫ్రికా సారధి బవుమాదీ ఇదే తీరు. ఇప్పటివరకూ సఫారీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో బవుమా చేసింది 10,2,2 పరుగులు మాత్రమే. దక్షిణాఫ్రికాను ముందుండి నడిపించాల్సిన నాయకుడు వరుసగా బ్యాట్‌తో విఫలం కావడం ఆ జట్టును కలవరపెడుతోంది.

సో సోగా ఇంగ్లాండ్​..
టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన జట్లన్నీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం సమస్యతో సతమతం అవుతుంటే.. ఇంగ్లండ్‌ ఓపెనర్లు మాత్రం పర్వాలేదనిపిస్తున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండంకెల స్కోరు నమోదు చేసిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు కీలకమైన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై శతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ మెగా టోర్నీ సెమీస్‌కు చేరుకునే లోపు ఏ జట్టు ఓపెనర్లు కుదురుకుని కప్‌ అందిస్తారో లేదో వేచి చూడాలి.

ఇదీ చదవండి: కోహ్లీ రూమ్‌ వీడియో లీక్​పై స్పందించిన హోటల్‌.. ఏం చెప్పిందంటే?

పాక్​లో విరాట్‌ కోహ్లీ సైకత శిల్పం.. కింగ్ ఎక్కడైనా కింగే కదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.