ETV Bharat / sports

'హైట్​ ఎక్కువ ఉండడం వల్లే అక్షర్ బాగా​ రాణిస్తున్నాడు' - axar patel last t20 match

Ashish Nehra On Axar Patel : ఆస్ట్రేలియాతో సిరీస్​లో మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచిన అక్షర్​ పటేల్​పై మాజీ టీమ్​ ఇండియా బౌలర్ ఆశిశ్​ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. పొడవు​ ఎక్కువగా ఉన్న కారణంగానే అక్షర్​ రాణిస్తున్నాడని చెప్పాడు. ఇంకా ఏం అన్నాడంటే..

Axar Patel
Axar Patel
author img

By

Published : Sep 26, 2022, 10:17 AM IST

Updated : Sep 26, 2022, 11:33 AM IST

Ashish Nehra On Axar Patel : పొడవు ఎక్కువగా ఉండటం వల్ల బౌలింగ్​లో జడేజా కన్నా అక్షర్​ పటేల్ ఎక్కువ విజయాలు సాధిస్తున్నాడని మాజీ పేసర్‌, గుజరాత్‌ కోచ్ ఆశిశ్​ నెహ్రా అభిప్రాయపడ్డాడు. అతడు లైన్​లో బౌలింగ్​ వేస్తున్నాడని.. అదే అతడి అతిపెద్ద బలం అని పేర్కొన్నాడు. ఆదివారం హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఆఖరి మ్యాచ్​లో భారత్​ విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో అక్షర్​ మూడు వికెట్లు తీసి అదరహో అనిపించాడు. దీంతో 2-1 తేడాతో సిరీన్​ను టీమ్​ ఇండియా కైవసం చేసుకుంది.

"లెంగ్త్​పై అతడికి పూర్తి కంట్రోల్​ ఉంది. అతడి బౌలింగ్​లో స్వీప్​ ఆడటం కష్టం. అయితే జడేజాతో పోల్చితే.. అక్షర్​కు ఎత్తు అడ్వాంటేజ్​. అందుకే జడేజా కంటే అక్షర్​ ఎక్కువ విజయం సాధిస్తున్నాడు. ​అక్షర్​ లైన్​ టైట్​గా ఎప్పుడూ స్టంప్స్​కే వేస్తాడు. అలా ఆడటానికి వీలు కల్పించకపోతే..​ బ్యాటర్​కు బ్యాటింగ్​ పిచ్​లపై కూడా ఆడటం కష్టమవుతుంది"

ఆశిశ్​ నెహ్రా, భారత మాజీ పేసర్​

అక్షర్​ బౌలింగ్​పై మరో టీమ్​ ఇండియా మాజీ బౌలర్​ ఆర్​పీ సింగ్ సైతం స్పందించాడు. పవర్‌ప్లేలోనూ బౌలింగ్​ చేయడం అక్షర్​ ప్రత్యేకత అని చెప్పాడు. అయితే అక్షర్​ అంతకుముందు బంతిని అంతగా టర్న్ చేసేవాడు కాదు.. కానీ ఇప్పుడు చాలా మెరుగయ్యాడని పేర్కొన్నాడు.

స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాకు గాయం కారణంగా టీమ్​లో అక్షర్​కు స్థానం లభించింది. అయితే ఈ సిరీస్​లో అక్షర్​ మంచి ప్రదర్శన చేశాడు. పవర్​ ప్లేలో బౌలింగ్ చేయగల బౌలర్​గా తయారయ్యాడు. దీంతో ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డ్​ అందుకున్నాడు. భారత్​-ఆసీస్ సిరీస్​లో 6.3 ఎకానమీతో మొత్తం 8 వికెట్లు తీశాడు. అతడు తీసిన 29 వికెట్లలో.. 2022లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడికి 7.12 ఎకానమీ రేటు ఉంది.

ఇవీ చదవండి: 'మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా'.. ఏది క్రీడా స్ఫూర్తి?

అదరగొట్టిన కోహ్లీ, సూర్య.. టీమ్​ఇండియా విజయం.. సిరీస్ కైవసం

Last Updated : Sep 26, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.