భారత బ్యాటింగ్ యువ సంచలనం షెఫాలీ వర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బ్రిస్టోల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు చేసింది ఈ 17 ఏళ్ల ఓపెనర్. అరంగేట్ర టెస్ట్‌లోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఫీట్ సాధించింది. మొత్తం మీద నాలుగో బ్యాటర్‌గా నిలిచింది.
గతంలో ఈ రికార్డు ఆసీస్ క్రికెటర్ జెస్సికా లూసి జొనాసేన్(22 ఏళ్లు) పేరిట ఉండేది. లూసి కూడా ఇంగ్లాండ్‌పైనే ఈ ఘనతను అందుకుంది. వీరిద్దరితో పాటు లంక బ్యాటర్ వనెస్సా బోవెన్, ఇంగ్లాండ్‌కు చెందిన లెస్లీ కూకీ ఈ ఫీట్ అందుకున్నారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 396/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా 231 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులు వెనుకబడిన భారత్‌ను.. హీథర్ నైట్ సేన ఫాలో ఆన్ ఆడిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో సెంచరీ అవకాశం కోల్పోయిన 17 ఏళ్ల షెఫాలీ.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో అజేయంగా క్రీజులో ఉంది.
ఇదీ చదవండి: వన్డేలకు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్