Steve Smith Catch : లండన్ వేదికగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు జరిగిన ఆటలో మిచెల్ స్టార్క్ వేసిన 46వ ఓవర్ బౌలింగ్‌లో జో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను స్టీవ్ స్మిత్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి పూర్తిగా స్మిత్ చేతిలో లేకపోయినా.. నేలను తాకుతున్నట్లుగా ఉన్నా.. దానిని ఔటని ప్రకటించగా రూట్ నిష్క్రమించాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అంపైరింగ్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు ఇంగ్లాండ్ అభిమానులు. దీనికి తోడు ఆసీస్ ఆటగాళ్లపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
-
Nine wickets ☝
— England Cricket (@englandcricket) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Three hundred and thirty-five runs 🏏
Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J
">Nine wickets ☝
— England Cricket (@englandcricket) June 30, 2023
Three hundred and thirty-five runs 🏏
Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2JNine wickets ☝
— England Cricket (@englandcricket) June 30, 2023
Three hundred and thirty-five runs 🏏
Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J
మళ్లీ సీన్ రిపీట్..
Ashes Series : అయితే ఇటీవల జరిగిన తొలి టెస్టులో కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్ కూడా వివాదాస్పదంగా మారింది. అప్పుడు బ్యాటర్ డంకెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లోని గ్రీన్ ఒడిసిపట్టాడు. కానీ, బంతి నేలను తాకినట్లు ఉందని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శించారు. అంతకుముందు భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను కామెరూన్ గ్రీన్ అందుకోగా.. ఈ వికెట్ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ ఔటివ్వడం వివాదాస్పదమైంది. ఈ విషయంలోనూ గ్రీన్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మ్యాచ్ అప్డేట్స్..
Ashes 2nd Test :లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్- ఆసీస్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు మంచి శుభారంభం లభించింది. రెండో రోజు ఆటలో 207/2 స్కోరుతో బలమైన స్థితిలో ఉన్న ఇంగ్లాండ్‌కు స్వల్ప వ్యవధిలో దెబ్బ తగిలింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. డకెట్ (98) సెంచరీ మిస్ చేసుకోగా.. జో రూట్ (10) త్వరగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 278/4 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో హ్యారీ బ్రూక్ (45*), బెన్ స్టోక్స్ (17*) ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఇంగ్లాండ్.. అసీస్ కంటే ఇంకా 138 పరుగులు మాత్రమే తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గాయపడ్డ నాథన్ లైయన్!
Nathan Lyon Injury : వరుసగా వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించిన ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ ఈ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో ఆసీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. రెండో టెస్టులో ఇప్పటి వరకు 13 ఓవర్లు వేసిన లైయన్ ఒక వికెట్ తీసి 35 పరుగులు సమర్పించాడు. ఈ క్రమంలో లైయన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందించాడు.
"లైయన్ మిగతా మూడు రోజులు ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేము. అతడి పరిస్థితిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేము. ఒకవేళ అతడు మాత్రం జట్టులో లేకపోతే ఈ టెస్టులో మాకు ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. అంతా సవ్యంగా సాగుతుందనే నమ్మకంతో ఉన్నాం."
- స్టీవ్ స్మిత్, ఆసీస్ ప్లేయర్