ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో టెస్టు గురించి టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. పునర్నిర్మించిన మొతేరా స్టేడియంలో బంతి ఎంత స్వింగ్ అవుతుందో ఊహించడం కష్టమని పుజారా పేర్కొన్నాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ను గెలవడం వల్ల ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరగబోయే టెస్టుపై అందరి దృష్టి పడింది. పింక్‌బాల్‌తో జరిగే డే/నైట్ టెస్టుల్లో భారత్‌కు అంతగా అనుభవం లేదు. గులాబీ బంతితో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడింది టీమ్ఇండియా.
''నేను చాలా టెస్టు మ్యాచ్‌లు ఆడాను. కానీ పింక్ బాల్‌తో ఆడటం నాక్కూడా కొత్తే. బంతి స్వింగ్ అవుతుందా? స్పిన్ అవుతుందా? అనేది అంచనా వేయటం కష్టం. అనుభవంతో దీన్నీ ఊహించటం అసంభవం. మొతేరా అనేది పూర్తిగా కొత్త పిచ్. ఇక్కడ ఆడే కొద్ది ఈ పిచ్ గురించి అవగాహన పెరుగుతుంది. గతంలో ఈ పిచ్ స్పిన్‌కు సహకరించేది. కాస్త ఓపికతో ఆడితే బ్యాటింగ్ కూడా సులభమే. 2012లో నేను ఇదే ఇంగ్లాండ్‌పై 206 పరుగులతో నాటౌట్‌గా నిలిచాను.''
-ఛెతేశ్వర్ పుజారా, టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్.
'పింక్ టెస్టులో ఎస్జీ బంతి ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మేము గతంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా పింక్‌బాల్ టెస్టు ఆడాం. అప్పుడు గెలిచాం. విదేశాలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 36 పరుగులకే ఆలౌటయ్యాం. అప్పుడు ఓడిపోయాం. అందుకే గులాబీ బంతితో ఎప్పడు ఏమి జరిగేది ఊహించలేం' అని పుజారా తెలిపాడు.
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనలే మా లక్ష్యమని నయావాల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలంటే తాము జట్టుగా రాణించాల్సిన అవసరముందని వెల్లడించాడు.
ఐపీఎల్‌పై స్పందిస్తూ..
ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని, తన సారథి మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో మరోసారి కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పుజారా అన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పుజారాను రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఫ్రాంఛైజీ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం గొప్పగా ఉందన్నాడు.
'ఐపీఎల్‌లో తిరిగి ఆడటం గొప్పగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పచ్చ జెర్సీలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను మళ్లీ ధోనీ భాయ్‌తో కలిసి ఆడబోతున్నా. టెస్టుల్లో నేను అరంగేట్రం చేసినప్పుడు అతడే నా సారథిగా ఉన్నాడు. దాంతో ధోనీతో కొన్ని తీపి జ్ఞాపకాలున్నాయి. ఇప్పుడు మరోసారి అతడితో ఆడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఐపీఎల్ అనేది ఆలోచన విధానంలోని మార్పు. టెస్టు ఫార్మాట్ నుంచి ఇందులోకి మారడం మానసిక అంశం. ఈ విషయంలో సరైన సన్నద్ధతతో ముందుకెళ్తే త్వరగా మారిపోవచ్చు. అయితే, రాబోయే సీజన్‌లో నేను మంచి ప్రదర్శన చేస్తాననే నమ్మకం ఉంది' అని పుజారా చెప్పుకొచ్చాడు. కాగా, పుజారా చివరిసారి 2014లో పంజాబ్ తరఫున ఆడి ఆరు మ్యాచ్‌ల్లో 125 పరుగులు చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు క్రికెట్ మెగా ఈవెంట్‌లో ఆడబోతున్నాడు.
-
A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA
— Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA
— Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA
— Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇదే సీజన్ కోసం ఓపెనర్‌గా.. ట్రేడింగ్ పద్ధతిలో రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఉతప్పని తీసుకుంది. అతడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక స్టార్ ఆటగాడు సురేశ్ రైనా తిరిగి జట్టులో చేరడంతో మూడో నంబర్ ఆటగాడిగా కొనసాగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో పుజారా ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరం.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో టీ20లకు సూర్యకుమార్, ఇషాన్- జట్టు ఇదే